తనీష్ కి దీప్తి భర్త చురకలు…!

బిగ్ బాస్ సీజన్ 2 లో అమ్మ.. అమ్మ అని పిలుస్తూనే పార్టిసిపెంట్ దీప్తి నల్లమోతుతో టాస్క్‌ లలో పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు తనీష్. ప్రస్తుతం ఇతని ప్రవర్తనపై సోషల్ మీడియాలో రకరకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రిలేషన్స్ కి వ్యాల్యూ ఇస్తానని.. అంతేకానీ గేమ్స్ లో ఆలా ఆడటం తప్పట్లేదని వివరణ ఇచ్చిన అతనిపై కొంతమంది సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు.

నామినేట్ చేస్తాడనే భయంతో…

తనీష్ అంతకముందు సామ్రాట్‌తో.. సునయనతో ఈ విధంగా ఆడలేదు. అయితే దీప్తి దీనిని తనకు అనుకూలంగా వాడుకోలేకపోతుంది. ఎక్కడ నోరెత్తి మాట్లాడితే తనను తనీష్  నామినెట్ చేస్తాడో అని భయపడుతుంది. మరి తనీష్ ఏమైనా ఊరికే ఊరుకుంటున్నాడా.. దీప్తిని పదే పదే నామినేట్‌ చేస్తూనే వచ్చాడు. అయితే దీప్తి.. తనీష్ ప్రవర్తనపై స్పదించక పోయేసరికి నామినేషన్స్ రోజు కౌశల్ గట్టిగా తనీష్ కి క్లాస్ పీకాడు. తను అనుకుంటున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

ఒక్కసారిగా నెగటివ్ కావడంతో…

ఇక నిన్న సామ్రాట్ వాళ్ల అమ్మ వచ్చి అమ్మ గురించి భలే మాట్లాడుతున్నావయ్యా అనడంతో కౌశల్ హీరో అయిపోయాడు. నిన్న దీప్తి వాళ్ల భర్త వెళ్తూవెళ్తూ తనీష్ కి ‘ఫిజికల్‌ టాస్క్‌ లు ఆడేటప్పుడు కొంచెం చూసుకోండి’ అని ఒక చురక వేసి పోయాడు. దీంతో తనీష్ కు నిన్న ఒకేసారి ఆలా అందరి దగ్గర నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో స్మోకింగ్‌ రూమ్‌లో దూరి బాధ పడిపోవడం మొదలు పెట్టాడు. అతన్ని సామ్రాట్ వచ్చి ఓదార్చటం కూడా జరిగింది. మరి ఫైనల్ కూడా ఎంతy దూరం లేదు కొంచెం చూసుకుని చాలా జాగ్రత్తగా ఆడితే ఫైనల్ వరకు వెళ్లగలడు..లేదంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వక తప్పదు.