`దేవదాస్` నైజాం షాకింగ్ బిజినెస్..!

నాగార్జున – నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘దేవదాస్’. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్ లో నాని పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడు చూద్దాం అని నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టీజర్ వల్లే భారీ బిజినెస్..!

నాని సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. నాగార్జునకి పర్లేదు. అయితే రీసెంట్ గా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా నైజాం హక్కుల్ని ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేత సునీల్ నారంగ్ షాకింగ్ రేట్ కి కొనుక్కున్నారని తెలుస్తోంది. ఏకంగా 11.07కోట్లకు వారు ఈ సినిమాను కొన్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. మిగిలిన ఏరియాల బిజినెస్ కూడా అంతే స్పీడ్ గా ఉందని సమాచారం. నాగ్ కి జోడిగా ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా..నాని సరసన రశ్మిక మందన్న హీరోయిన్ గా కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న అవ్వబోతుంది. టీజర్ వల్లే బిజినెస్ ఇంతలా జరుగుతుందని ట్రేడ్ వారు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*