15 కోట్లు వస్తాయా..!

సినిమాలకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరుగుతుందో అని నిర్మాతలకు కాస్త క్యూరియాసిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సినిమాలకు ఎంత శాటిలైట్ హక్కుల ద్వారా వస్తుందో అనే క్యూరియాసిటీ వచ్చేస్తుంది. సినిమాల వ్యాపారంలో ఈ శాటిలైట్ హక్కులు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాస్త క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కితే చాలు ఆ సినిమా శాటిలైట్ హక్కుల కింద నిర్మాతలకు బోలెడంత కనకవర్షం కురుస్తుంది. లోబడ్జెట్ సినిమాలకైతే శాటిలైట్ హక్కుల కిందవచ్చే డబ్బు లాభాల్లో ఉంటుంది. ఆ రేంజ్ లో శాటిలైట్ హక్కులు అమ్ముడుపోతున్నాయి. మహానటి విడుదలకు ముందు ఛానల్స్ ఎవరూ మహానటిని కొనకపోతే.. విడుదయాలయ్యాక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో.. అశ్వినీదత్ ఆ సినిమాని స్టార్ మాకి చాలా లాభసాటిగా అమ్మేశాడు.

ఏకంగా 15 కోట్లు..!

అయితే ఇప్పుడు నాని – నాగార్జున క్రేజీ కాబోలో శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవదాస్ సినిమా శాటిలైట్ రైట్స్ కి అశ్వినీదత్ ఛానల్స్ కి బేరం పెట్టాడట. కేవలం 10 కోట్ల పెట్టుబడి.. హీరోల రెమ్యునరేషన్ తో కలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాకి శాటిలైట్ హక్కులకు అశ్వినీదత్ ఏకంగా 15 కోట్ల అడుతున్నాడట. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని, నాగార్జున కి తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ మట్లాడుకుని మరీ అశ్వినీదత్ ఈ సినిమాని తక్కువ బడ్జెట్ తో లేపేస్తున్నాడు. మరి తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభాలను మహానటి ఆర్జించినట్లుగా ఇప్పుడు దేవదాస్ కి అలాంటి లాభాలనే అర్చించే ప్లాన్ చేస్తున్నాడట.

శాటిలైట్ హక్కులతో లాభాలు…

మరి కేవలం శాటిలైట్ తోనే పెట్టుబడి వెనక్కి తెచ్చేసి సినిమా ప్రమోషన్స్ ని కూడా ఆ వచ్చిన మొత్తంతోనే కానిచ్చేసి ప్రీ రిలీజ్ ద్వారా వచ్చే సొమ్ముని వెనకేసుకొని లాభాలు ఆర్జించాలని అశ్వినీదత్ ప్లాన్ గా తెలుస్తుంది. మరి నాగార్జున – నాని కాంబో మీద మంచి క్రేజ్ ఉంది. అలాగే నాని సోలోగా సూపర్ హిట్ హీరో. అందుకే అశ్వినీదత్ ఎలాగైనా దేవదాస్ ని 15 కోట్లకి ఛానల్స్ కి అంటగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరి అంత పెద్ద మొత్తం పెట్టి ఏ ఛానల్ ఈ దేవదాస్ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది అనేది ప్రస్తుతం ఎడతెగని సస్పన్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*