నవ్వులు పూయిస్తున్న దేవదాస్

తెలుగు ఇండ‌స్ట్రీలో అంద‌రి ఆస‌క్తిని త‌న‌వైపు తిప్పుకుంటున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. నాగార్జున‌, నాని హీరోలుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లైంది. ఈ టీజర్ ఆద్యంతం న‌వ్వుల‌తో నిండిపోయింది. నాగార్జున డాన్.. నాని డాక్ట‌ర్ గా న‌టిస్తున్నారు. ఒక్క పాట మిన‌హా దేవ‌దాస్ షూటింగ్ అంతా పూర్తైంది. ఈ మ‌ధ్యే బ్యాంకాక్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని వ‌చ్చారు. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఆగ‌స్టు మొద‌ట్లోనే విడుద‌లైంది. దీనికి ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ ద‌త్ సైనూద్దీన్ సినిమాటోగ్ర‌ఫ‌ర్. వైజ‌యంతి సంస్థ‌లో సి ధ‌ర్మ‌రాజు సమ‌ర్ప‌ణ‌లో అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*