టాలీవుడ్ పై కన్నేసిన ధనుష్..!

dhanush eye on tollywood

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టీజర్ తో మంచి హైప్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. అప్పుడే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా మంచి బేరాలు వచ్చేసాయి. దాదాపు 12 కోట్లకి ఈ సినిమా అమ్ముడైనట్టు టాక్. నిర్మాత రాధా మోహన్ ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసినట్టు టాక్. మరోపక్క ఈ సినిమాపై తమిళ నటుడు ధనుష్ కూడా ఇంట్రెస్ట్ చూపడం విశేషం.

ధనుష్ కు నో ఛాన్స్

ఈ సినిమాతో తెలుగు మార్కెట్ లోకి అడుగు పెట్టాలని ధనుష్ చూస్తున్నాడు. తన సంస్థ అయిన వండర్ బార్ ని టాలీవుడ్ లో కూడా విస్తరించాలనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమాకు ఆయన కూడా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటికే రాధామోహన్ కు అగ్రిమెంట్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ధనుష్ ఈ సినిమాను కొనుగోలు చేసే అవకాశం లేదు. గరుడ వేగ సినిమాతో హిట్ కొట్టిన రాజశేఖర్ ఈ సినిమాతో 12 కోట్లు వసూలు చేయడం అంత కష్టమైన పని ఏమీ కాదు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*