మహానటికి.. కధానాయకుడుకి అదే తేడా…!

huge loss for kathanayakudu buyyers

టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు మాములుగా రాలేదు. గత ఏడాది చాలా తక్కువ బడ్జెట్ తోనే నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ మహానటిని అందరూ మెచ్చేలా తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇక ఈ ఏడాది బాలయ్య – క్రిష్ లు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడితో ముందుకొచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ ని ఒక భాగంగా చూపించలేక కథానాయకుడు, మహానాయకుడిగా తెరకెక్కించి ఒక నెల రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఇప్పటికే కథానాయకుడు విడుదలై ప్రేక్షకుల మనస్సులను దోచేసింది. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంతో పాటు, నట జీవితాన్ని కథానాయకుడిలో చూపించారు.

 

ntr biopic roles and actors telugu post telugu news

మహానటిలో ఉన్న ఎమోషన్స్ లేవు..!

అయితే మహానటిలో ఉన్న కామెడీ, ఎమోషన్ ఈ ఎన్టీఆర్ బయోపిక్ లో పెద్దగా కనబడవు. ఎందుకంటే మహానటిలో సావిత్రి కథను జర్నలిస్టులైన సమంత, విజయ్ దేవరకొండల మీద నడపడం.. సావిత్రి చిన్ననాటి నుండి అల్లరిగా.. ఎవరి మాట వినని గడుసు అమ్మాయిగానే పెరిగింది. ఇక జెమిని గణేషన్ తో పెళ్లి, నటన, పిల్లలు, దుబారా ఖర్చు వలన అవసాన దశలో ఆమె పడిన వేదన ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎమోషన్ కి పెద్దగా చోటుండదు. ఎన్టీఆర్ కుటుంబాన్ని విదిలి సినిమాల్లోకి రావడం.. చిన్నచిన్న ఇబందులు తప్ప ఆయన నట జీవితంలో పెద్దగా ఒడిడుకులు కనిపించవు. అలాగే ఎమోషన్ గా బలంగా హత్తుకునే సీన్స్ కూడా ఓ అన్నంత లేవు. ఇక మహానటిగా అంటే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది. కథానాయకుడులో బాలకృష్ణ ఎన్టీఆర్ గా నట విశ్వరూపం చూపించాడు. కానీ ఎన్టీఆర్ యంగ్ లుక్ లో బాలయ్య మాత్రం సరిగ్గా అతకలేదు.

ntr biopic telugu post telugu news

 

కేవలం నట జీవితమే కావడంతో…

బయోపిక్ లు అంటే అంత కన్నా ఎక్కువ ఆశించలేము. ఎందుకంటే జీవితచరిత్రగా తెరకెక్కిన సినిమాలో జీవితంలో జరిగినవి చూపిస్తారు కానీ… కామెడీని బలవంతంగా ఇరికించలేరు. ఇక ఎన్టీఆర్ నటజీవితం సాఫీగా సాగడంతోనే అందులో పెద్దగా ట్విస్టులు ఏమీ కనబడవు. ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ మరణం అప్పుడు మాత్రం కాస్త ఎమోషన్ అవుతాడు ప్రేక్షకుడు. ఇక ఎక్కడా అంతగా ఎమోషన్స్ సీన్స్ కనబడలేదు. అలాగే కథానాయకుడులో ప్రధాన మైనస్ గ్రిప్పింగ్ మిస్ కావడం.. స్లో నేరేషన్ అక్కడక్కడ అసహనం కలిగిస్తుంది. అదే సావిత్రి వ్యక్తిగత, నట జీవితాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ సమాంతరంగా మెయింటైన్ చేసాడు. మహానటి స్క్రీన్ ప్లే బాగుంటుంది. కథానాయకుడిలో ఎక్కడా కాంట్రవర్సీలకు తావివ్వలేదు. అంటే నట జీవితం పరిపూర్ణం. మరి రేపు రాబోయే మహానాయకుడు ఎన్ని కాంట్రవర్సీలకు నెలవు అవుతుందో అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*