రామ్ చరణ్ కు అసలు పరీక్ష..!

test to ram charan stamina

‘మగధీర’కి ముందు రామ్ చరణ్ మార్కెట్ వేరు ‘మగధీర’ తరువాత వేరు. తన ప్రతి సినిమాతో తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్. తెలుగు రాష్ట్రాల్లో చరణ్ కు ఎంత మార్కెట్ ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఇక్కడ ఉన్న స్టామినా చరణ్ కు ఎందుకో ఓవర్సీస్‌ మాత్రం ఉండదు. కానీ ‘ధృవ’తో తొలి మిలియన్‌ డాలర్ల సినిమాని సొంతం చేసుకున్నాడు. ఇక లేటెస్ట్ గా ‘రంగస్థలం’ సినిమాతో ఏకంగా అక్కడ నాన్‌ ‘బాహుబలి’ రికార్డునే నెలకొల్పాడు.

సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్ లో ఆదరణ

అయితే అలా రికార్డ్స్ నెలకొల్పడానికి సుకుమార్ క్రెడిట్ కూడా ఉంది. సుకుమార్ చిత్రాలు అంటే ఓవర్సీస్ లో బిజినెస్‌ చాలా బాగుంటుంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అతని సినిమాలకి అక్కడ ఆదరణ లభిస్తుంది. కాబట్టి ‘రంగస్థలం’ లో పూర్తి క్రెడిట్ రామ్ చరణ్ ఒక్కడిదే కాదు. అయితే ఈసారి రిలీజ్ అయ్యే ‘వినయ విధేయ రామ’ చిత్రం చరణ్‌ స్టామినాని పరీక్షిస్తుంది.

మాస్ సినిమాలకు కష్టమే…

ఎందుకంటే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న బోయపాటికి అక్కడ మార్కెట్ తక్కువ. ఇంతవరకు బోయపాటి సినిమా ఒక్కటి కూడా యుఎస్‌లో మిలియన్‌ డాలర్లు సాధించలేదు. మాస్ సినిమాలకి యుఎస్‌లో సరిగా వసూళ్లు రావని ‘అరవింద సమేత’తో మరోసారి తేలింది. ఇది కూడా మాస్ సినిమానే. మరి ఈ మాస్ సినిమాతో అక్కడ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. రెండు మిలియన్‌ డాలర్ల మార్కును అందుకుంటాడో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*