మరో భారీ మల్టీస్టారర్ తీస్తున్న దిల్ రాజు

dil raju film with naga chaitanya kajal

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వెంకటేశ్‌, మ‌హేశ్ వంటి స్టార్ హీరోల‌తో తెర‌కెక్కించి మల్టీస్టార‌ర్ చిత్రాల‌కు నిర్మాత దిల్‌రాజు నాంది పలికారు. అక్క‌డి నుండి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ ఏడాది దిల్‌రాజు ఇప్ప‌టికే వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో `ఎఫ్ 2`(ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌) అనే మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇంద్రగంటితో దర్శకత్వంలో…

ఇది కాకుండా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీకారం చుడుతున్నారు దిల్‌ రాజు. `అష్టాచ‌మ్మా, గోల్కొండ హైస్కూల్‌, అమీ తుమీ, జెంటిల్‌మన్‌, స‌మ్మోహ‌నం` వంటి డిఫ‌రెంట్‌, సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివ‌రాల‌ను చిత్ర‌ యూనిట్ తెలియ‌జేస్తుంది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*