మీకో నమస్కారం అంటున్న దిల్ రాజు..!

venkatesh given hit to dil raju

మొన్నామధ్యన హీరో నానితో నిర్మాత దిల్ రాజు సభకు నమస్కారం అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం నాని దేవదాస్ తో పాటు జెర్సీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండడమే కాదు మరోపక్క బుల్లితెర మీద కూడా బిగ్ బాస్ సీజన్ 2 అంటూ దున్నేస్తున్నాడు. అయితే అప్పటి నుండి సభకు నమస్కారం మీద ఎటువంటి న్యూస్ రాలేదు. కానీ తాజాగా నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ తో కాస్త తికమకలో ఉన్న అల్లు అర్జున్ తో దిల్ రాజు ఈ సభకు నమస్కారం సినిమా చేయబోతున్నట్లుగా నిన్న సోషల్ మీడియాలో గాసిప్స్ హల్చల్ చేశాయి.

క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

ఎలాగూ నా పేరు సూర్య తర్వాత ఇంతవరకు అల్లు అర్జున్ మరో సినిమాని ఇంకా అనౌన్స్ చెయ్యలేదు… విక్రమ్ తో సినిమా ఉంటుందో లేదో అన్నట్లుగా ఉన్న కన్ఫ్యూజన్ టైం లో అల్లు అర్జున్ తో దిల్ రాజు సభకు నమస్కారం సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు ప్రచారం జరిగాయి. అలాగే దిల్ రాజు, బన్నీ లు సభకు నమస్కారం కథ కోసం డైరెక్టర్ ని సెట్ చేసే పనిలో ఉన్నట్లుగా చెప్పారు. మరి శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దిల్ రాజు చెవికి చేరింది ఈ అల్లు అర్జున్ సభకు నమస్కారం వార్త. అయితే సభకు నమస్కారం సినిమాని అల్లు అర్జున్ తో చెయ్యడం లేదని.. అలాగే ప్రస్తుతం ఆ సినిమా కోసం మరే హీరోని అనుకోవడం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

నేను చేస్తున్నవి ఆ రెండు సినిమాలే

అల్లు అర్జున్ తో సభకు నమస్కారం సినిమా న్యూస్ ఫెక్ న్యూస్ అని.. కేవలం నా బ్యానర్ లో ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలకు సిద్ధమవుతుందని… అలాగే ఇంకా తన బ్యానర్ లో మహేష్ 25 వ చిత్రంతో పాటుగా వరుణ్ తేజ్, వెంకటేష్ ల మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2 మాత్రమే తెరకెక్కుతున్నాయని.. మరే సినిమా తన బ్యానర్ లో చెయ్యడం లేదని చెప్పాడు. మరి ఇప్పుడు సభకు నమస్కారం కూడా బన్నీ చేయకపోతే మళ్లీ ఆయన కొత్తం చిత్ర అనౌన్సమెంట్ ఎప్పుడా అని ఎదురు చూడడం బన్నీ ఫాన్స్ వంతైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*