సీనియర్ హీరోనే ఆదుకున్నాడు..!

venkatesh given hit to dil raju

దిల్ రాజు బ్యానర్ సినిమాలు చేస్తే తమకి హిట్ రావడం ఖాయమని.. చాలా మంది యంగ్ ప్లాప్ హీరోలు గత ఏడాది దిల్ రోజునే నమ్ముకుని సినిమాలు చేశారు. మరి వాళ్ల బ్యాడ్ లక్ దిల్ రాజుకి అంటుకుందో.. లేదంటే… డైరెక్టర్స్ బ్యాడ్ లక్కో లేదా దిల్ రాజుకి టైం బాలేకనో కానీ… దిల్ రాజు నిర్మాణంలో కుర్ర హీరోలు నటించిన సినిమాలన్ని దెబ్బేసాయి. నితిన్, రామ్, రాజ్ తరుణ్.. ఇలా ఏ హీరో చూసినా దిల్ రాజుకి ప్లాపులే అంటగట్టారు. అయితే హీరోల మాట ఎలా ఉన్నా.. దిల్ రాజు మాత్రం వారేదో ప్లాప్స్ లో ఉన్నారు.. వారికి హిట్ ఇవ్వడానికే వారి కోసమే సినిమా చేసానని.. దిల్ రాజు ఆయా హీరోల సినిమా ఈవెంట్స్ లో గొప్పగా మాట్లాడాడు. కానీ దిల్ రాజు గొప్పలు ఆయా హీరోల సినిమాలు ఫ్లాప్ అవడంతో గాలి తీసేసినట్లు అయ్యింది.

ఏడాది మొదట్లోనే హిట్…

రాజ్ తరుణ్ లవర్ తో… నితిన్ శ్రీనివాస కళ్యాణంతో, రామ్ హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు దిల్ రాజుని బాగా దెబ్బతీశాయి. మరి కుర్ర హీరోలు ఫ్లాపులిస్తే ఏమిటి… ఇప్పుడు సీనియర్ హీరో దిల్ రాజుకి మంచి హిట్ అందించాడు. కుర్ర హీరో వరుణ్ తేజ్ – సీనియర్ హీరో వెంకటేష్ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఈ శనివారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వరుణ్ కామెడీ కన్నా ఎక్కువగా.. వెంకటేష్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనేది ఎఫ్ 2 టాక్ తోనే తెలుస్తుంది. ఎఫ్ 2 సినిమాకి ప్రేక్షకులు, రివ్యూ రైటర్స్ నుండి పాజిటివ్ మార్కులు పడ్డాయి. అందులోనూ వెంకీ కామెడీ టైమింగ్ కి ప్రేక్షకుడు ఫిదా అంటున్నారు. ఈ ఏడాది మొదట్లోనే దిల్ రాజుకి ఎఫ్ 2తో వెంకటేష్ మంచి హిట్ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఎఫ్ 2తో హిట్ అందుకున్న దిల్ రాజు.. మహెష్ తో చేస్తున్న మహర్షి సినిమాతో కూడా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*