దిల్ రాజు ప్లానింగే… వేరయా!

venkatesh given hit to dil raju

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ నుండి ప్రేక్షకుల ముందుకు రావడానికి శ్రీనివాస కళ్యాణం సినిమా రెడీగా వుంది. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ లో ఫుల్ క్రేజ్ తో పాటు ట్రేడ్ లోను మంచి బజ్ ఉంది. రెండు సినిమాల ఫ్లాప్ హీరో నితిన్ కి ఈసారి శ్రీనివాస కళ్యాణంతో భారీ హిట్ ఖాయమనేలా ఉంది ఈ సినిమాపై ఉన్న క్రేజ్. ఇక దిల్ రాజు కూడా ఈ సినిమాపై భారీ నమ్మకాన్నే పెట్టుకున్నాడు. మంచి బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్స్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పెళ్లిని తలపిస్తున్న సినిమా ఈవెంట్లు

ఇకపోతే శ్రీనివాస కళ్యాణం సినిమా ఆడియో వేడుకని ఒక రిచ్ పెళ్లిలా నిర్వహించిన దిల్ రాజు.. ఇప్పుడు రిలీజ్ ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ వేడుకని కూడా మరో పెళ్లిలా నిర్వహించి ఔరా అనిపించాడు. ప్రసాద్ ల్యాబ్ లో గత రెండు రోజులుగా పెళ్లి వేడుకలా ఆ ల్యాబ్ గెట్ దగ్గర నుండి లోపలి వరకు చేసిన డెకరేషన్ నిజంగా.. ఇక్కడ పెళ్లి జరుగుతుందా అనే ఫీలింగ్ తెప్పించింది. ఆ పూల డెకరేషన్.. లైటింగ్ ఇవన్నీ నిజమైన పెళ్లి వేడుకని తలపిస్తున్నాయి. ఇక ఆ ప్రెస్ మీట్ కి వచ్చిన హీరో నితిన్, రాశి ఖన్నా ఆ డెకరేష్ ని చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. మరి దిల్ రాజు ఎక్కడా తగ్గకుండా శ్రీనివాస కళ్యాణం ప్రమోషన్స్ ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నాడు.

పెళ్లిళ్లు చేసుకునే వారికి భారీ ఆఫర్

ఇక ఇప్పుడు తాజాగా దిల్ రాజు శ్రావణ మాసంలో పెళ్లిళ్లు చేసుకోబోయే జంటలకు శ్రీనివాస కళ్యాణం చిత్ర బృందం, కళామందిర్ కల్యాణ్ తో కలిసి ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించాడు. శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే వారు తమ పెళ్లి కార్డును పంపితే వారికీ శ్రీనివాసుడి దగ్గర పూజ చేయించిన పట్టు బట్టలు పంపుతామని.. అలాగే కొంతమంది లక్కీ జంటలను ఎంపిక చేసి శ్రీనివాస కళ్యాణం టీమ్ స్వయంగా వచ్చి పట్టు వస్త్రాలను అందిస్తామని చెబుతున్నాడు. మరి ఇలా శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ ని దిల్ రాజు తెలివిగా ఒక రేంజ్ లో చేపడుతూ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేలా చేస్తున్నాడు. ఏదైనా దిల్ రాజు ప్లానింగే వేరయా…!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*