సంక్రాతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది..!

f2 sankranthi sentiment

2017 సంక్రాతిలో మెగాస్టార్ చిరు కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ – క్రిష్ ల గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్, భారీ అంచనాలతో ఉన్న సినిమాలు.. అయినప్పటికీ దిల్ రాజు కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిన శతమానం భవతిని సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. మరి చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో సూపర్ హిట్ కొత్తగా… బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి కూడా హిట్ అయ్యింది. అంత పెద్ద సినిమాల్లో చిన్న సినిమాగా విడుదలైన శతమానం భవతి సూపర్ హిట్ అవడమే కాదు.. మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి దిల్ రాజుకి సెంటిమెంట్ ఇచ్చింది.

మళ్లీ బాలయ్యతోనే పోటీ

తాజాగా ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ చిత్రాల నడుమ తన చిత్రాన్ని విడుదల చెయ్యాలని దిల్ రాజు కంకణం కట్టుకుని కూర్చున్నాడు. గత ఏడాది డిసెంబర్ చివరి వరకు దిల్ రాజు సంక్రాతి పోటీకి భయపడి తన చిత్రం ఎఫ్ 2 వదలడేమోలే ఆనుకుంటే.. అనూహ్యంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకే తన ఎఫ్ 2 సినిమాని థియేటర్స్ లోకి తెచ్చేసాడు. మరి ఈ సంక్రాంతికి బాలకృష్ణ తో మళ్లీ పోటీ పడ్డాడు దిల్ రాజు. 2017లో తండ్రి చిరుతో పోటీపడిన దిల్ రాజు చిత్రం ఈ ఏడాది కొడుకు చరణ్ సినిమాతో పోటీ పడింది.

ప్రమోషన్స్ లేకపోయినా…

మరి ఈ ఏడాది కూడా దిల్ రాజు సంక్రాంతికి వచ్చి ఎప్పటిలాగే హిట్ కొట్టేసాడు. ఎఫ్ 2 ఈ శనివారమే సంక్రాతి కానుకగా చివరి చిత్రంగా విడుదలై, కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడం.. ప్రేక్షకులు మెచ్చడం జరిగింది. ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామలకు గట్టి పోటీ ఇచ్చింది ఎఫ్ 2 చిత్రం. మరి దిల్ రాజు పెద్ద సినిమాల హడావిడిలో తమ సినిమా ప్రమోషన్స్ ఎందుకు అనుకున్నాడో లేదా ఎలాగూ హిట్ అవుతుంది ప్రమోషన్స్ అవసరం లేదనుకున్నాడో.. ఎఫ్ 2 సినిమాకి చాలా తక్కువ ప్రమోషన్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రమోషన్స్ లేకపోయినా ఎఫ్ 2 మౌత్ టాక్ తో లేచేలా కనబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*