ఇష్టమైన దేవుడే అన్యాయం చేస్తున్నాడా…?

టాలీవుడ్ లో నిర్మాత దిల్ రాజు చాలా కాలిక్యులేటెడ్ గా సినిమాల కథలను జేడ్జ్ చేసి మరీ.. దానికి తగ్గ దర్శకులను ఎన్నుకుని మరీ సినిమాని నిర్మిస్తాడని.. దిల్ రాజు మీద కేవలం యంగ్ హీరోల నమ్మకమే కాదు.. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకుంటారు. అందుకే ఏ నిర్మాతకి లేని క్రేజ్ దిల్ రాజుకి ఉంది. దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా అంటే అందరిలో ఆటోమాటిక్ గా ఆసక్తి క్రియేట్ అవుతుంది. అలాంటి దిల్ రాజుకి వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన ఇష్టం. అందుకే ఆయన బ్యానర్ కి వెకటేశ్వరుని పేరున శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని స్థాపించాడు. ఇక అస్తమాను దిల్ రాజుకి తిరుపతి వెళ్లిరావడం కూడా బాగా ఇష్టం.

ఇంతకుముందు సినిమాలూ అంతే..

అయితే ఇప్పుడు దిల్ రాజుని తన ఇష్ట దైవమే అన్యాయం చేస్తున్నాడనిపిస్తుంది. ఎలా అంటే ఆయన నిర్మించిన చాలా సినిమాలు హిట్టు. కానీ మధ్యమధ్యలో కొన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అందులో ఆయన దేవుడి పేర్లు పెట్టుకున్న సినిమాలే దెబ్బేస్తున్నాయి. గతంలో హీరో రామ్ తో రామ రామ కృష్ణ కృష్ణ సినిమాని నిర్మిస్తే.. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. తర్వాత మొన్నీ మధ్యన సునీల్ హీరోగా కృష్ణాష్టమిని నిర్మించిన దిల్ రాజుకి ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా విడులప్పుడు ఈ సినిమా హిట్ అని ఆ సినిమాకి క్రిటిక్స్ ఇచ్చే రివ్యూస్ తో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.

శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తో…

ఇక తాజాగా వేంకటేశ్వరుని కి ఇష్టమైన శ్రీనివాస కళ్యాణం సినిమా పేరుతొ సినిమా తీస్తే ఇక్కడా తేడా కొట్టింది. తిరుపతిలో బ్రహ్మ్మోత్సవాలు జరుగుతున్నట్టుగా… అంతే అందమైన పెళ్లి పేరుతొ సతీష్ వేగేశ్న దర్శకుడిగా నితిన్ – రాశి ఖన్నా ల జంటగా దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాకి యావరేజ్ టాక్ రావడంతో.. పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది అంటే ఇపుడు నమ్మకం కుదరడం లేదు. ఈ సినిమాలో కేవలం పెళ్లి సీన్స్ తప్ప మరేం కొత్తదనమే లేకపోవడం.. అన్ని వర్గాలు మెచ్చేలా సినిమా లేకపోవడంతో ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యె లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక మొదటిరోజు నితిన్ శ్రీనివాస కళ్యాణం 3 కోట్ల పై మేర ప్రపంచవ్యాప్తంగా కొల్లగొట్టింది. ఈ లెక్కన దిల్ రాజుని ఇష్ట దైవమె అన్యాయం చేస్తున్నాడనిపిస్తుంది కదూ!.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*