గీత గురించి టెన్షన్ … మధ్యలో కమల్ దూరాడు..!

ప్రస్తుతం దిల్ రాజు కష్టాల్లో పడ్డాడు. గత వారం లవర్ సినిమాకి 8 కోట్లు పెట్టుబడి పెట్టి… ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్న దిల్ రాజు కి ఇప్పుడు టెన్షన్ మీద టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నితిన్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా తాను నిర్మిచిన శ్రీనివాస కళ్యాణం సినిమా మీద దిల్ రాజు బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నాడు. మీడియం బడ్జెట్ లో భారీగా హంగులతో నిర్మించిన ఈ సినిమాతో పెట్టిన దానికన్నా డబుల్ రాబట్టాలని దిల్ రాజు పక్కా ప్లాన్ తో శ్రీనివాస కళ్యాణం పబ్లిసిటీ చేస్తున్నాడు. దిల్ రాజు కోరుకున్నట్టుగానే శ్రీనివాస కళ్యాణం మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లోనూ బోలెడంత బజ్ ఉంది.

ఇప్పటికే అడ్డం వస్తున్న విజయ్

కుటుంబ కథా చిత్రాలకు ప్రేక్షకులెప్పుడు బ్రహ్మరథం పడతారు. అందుకే దిల్ రాజు కూడా ఆ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం కోసం ఒక మంచి డేట్ నీ లాక్ చేసుకుని పెట్టుకున్నాడు. ఆగస్టు 9న శ్రీనివాస కళ్యాణంకి విడుదల డేట్ కన్ఫర్మ్ చేశాక.. మరో ఆరు రోజుల్లోనే అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ తన గీత గోవిందం సినిమాని విడుదల చెయ్యబోతున్నాడు. మరి గీత ఆర్ట్స్ బ్యానర్ లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై బోలెడంత క్రేజ్ ఉండడంతో దిల్ రాజు కి టెన్షన్న్ స్టార్ట్ అయ్యింది. ఆ ఒక్క టెప్షన్ మాత్రమే కాదు… తాజాగా దిల్ రాజుకి మరో టెన్షన్ మొదలైంది.

కమల్ విశ్వరూపం చేస్తే కష్టమే

తన సినిమాని సోలోగా దింపి క్యాష్ చేసుకోవాలనుకుంటే… ఇప్పుడు తమిళనాట విశ్వరూపం 2 తో కమల్ హాసన్ ఇక్కడ తెలుగులో దిల్ రాజుకి దడ పుట్టిస్తున్నాడు. ఆగస్టు 10కి తన సినిమా విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్నాడు కమల్. మరి కమల్ సినిమాలకి మంచి క్రేజ్ తెలుగులోనూ ఉంటుంది. అసలే విశ్వరూపం 2 సినిమా విడుదలవక కష్టాల్లో ఉన్న కమల్ హాసన్ తన సినిమాని ఆగస్టు 10నే విడుదల చెయ్యడానికి రెడీ అయ్యాడు. మరి ఆ సినిమా తెలుగు, తమిళంలోనూ ఒకే రోజు విడుదల రాబోతుంది. ఇక శ్రీనివాస కళ్యాణం హిట్ అయినా.. కమల్ విశ్వరూపంతో ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. అందుకే దిల్ రాజు టెన్షన్ పడుతున్నాడట. ఇకపోతే కమల్ హాసన్ తో దిల్ రాజు ఇండియన్ 2 సినిమాని నిర్మించాల్సి ఉంది. కానీ ఆ బిగ్ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజు సైడ్ అయ్యి కమల్ హాసన్ కి హ్యాండ్ ఇచ్చాడు.