మారుతికి వేరే ఆప్షన్ లేదా..?

maruthi waiting for nani

మారుతి టాలెంటెడ్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే. అతని సినిమాలు మినిమం ఆడతాయి. అందుకే మారుతితో సినిమా చేయాలంటే ఎవరూ నో చెప్పారు. కానీ మారుతీ తన బ్రాండ్ కి న్యాయం చేసేవాళ్లనే తీసుకుంటాడు. తను రాసుకున్న స్క్రిప్ట్ కి ఎవరు సెట్ అయితే వారినే తీసుకుంటాడు. అందుకే ఆయన సినిమా సినిమాకి అంత గ్యాప్. ప్రస్తుతం మారుతి పరిస్థితి ఎలా ఉందంటే హీరో దొరికినా అతని డేట్స్ లేకపోవడం…పోనీ అడ్జస్ట్ అయిపోయి వేరే హీరోతో వెళదాం అంటే అది కుదరకపోవడం. ఇక మారుతి గత కొన్ని నెలలు నుండి హీరో నాని కోసం వెయిట్ చేస్తున్నాడు.

నానితో అయితేనే…

కొన్ని నెలలు కిందట మారుతి చెప్పిన లైన్ కి నాని బాగా కనెక్ట్ అయ్యి సినిమా చేద్దాం అని మాట ఇచ్చాడట. కానీ ఏమి లాభం నానికి ప్రస్తుతం వరస కమిట్ మెంట్ లు ఉన్నాయి. ఇంకెవరూ కనుచూపు మేరలో దొరకడం లేదు. గోపిచంద్, రామ్ ఉన్నా వారితో వర్కవుట్ అవ్వదు అని భావన. మరి చివరికి సాయి ధరమ్ తేజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్లీ మనుసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తేజుతో సినిమా చేస్తే ఓ మెట్టు దిగిపోయాడు అని అంటారేమో అన్న చిన్న అనుమానం కలుగుతుందట. అఖిల్ తో చేద్దాం అంటే ఆ ప్రెజర్ ని తట్టుకోలేడు అని భావిస్తున్నారు. అందుకే నానితో చేద్దాం అని ఫిక్స్ అయ్యాడు మారుతి. మరి ఇది ఎప్పటికి జరిగెను.

Sandeep
About Sandeep 6117 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*