తేజ వెనక్కి వస్తున్నాడా?

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాకు ఓపెనింగ్ కూడా జరుపుకున్న తర్వాత ఆ సినిమా నుండి డైరెక్టర్ తేజ తప్పుకోవడంతో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సడన్ గా తేజ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్ ను ఎవరు హాండెల్ చేస్తున్నారో అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది.

తెరపైకి చాలా మంది పేరులు వచ్చిన దానిపై నందమూరి బాలకృష్ణ ఏ విధంగా స్పందించలేదు. బాలకృష్ణనే ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి. చంద్రసిద్దార్థ దర్శకత్వ పర్యవేక్షణలో బాలయ్యే డైరెక్ట్ చేస్తాడన్న ప్రచారం కూడా జరిగింది. బయోపిక్ పక్కన పెట్టేయొచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇలాంటి పరిస్థితిల్లో మరో కొత్త రూమర్ హల్ చల్ చేస్తోంది. దర్శకుడు తేజ మళ్లీ తిరిగి ఈ ప్రాజెక్టులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇగో క్లాషెస్ వల్ల విడిపోయిన బాలయ్య..తేజ మళ్లీ కలుస్తున్నట్టు సమాచారం. తేజ తర్వాత కూల్‌గా ఆలోచించి.. మాట్లాడుకున్నారని.. ఇద్దరి మధ్య కొందరు రాయబారం నడిపి సమస్యను పరిష్కరించారని.. దీంతో తేజ మళ్లీ ఈ ప్రాజెక్టులోకి రావడానికి అంగీకరించారని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే బాలకృష్ణ లేదా తేజ నోరు విప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*