తేజ సినిమాలో కాజల్ పాత్ర ఇదే

తెలుగులో స్టార్ హీరోస్ తో ఎన్నో సినిమాలు చేసిన కాజల్… తెలుగు ప్రేక్షకుల్లో మంచి మార్కులే కొట్టేసింది. గ్లామర్ పరంగా.. నటన పరంగా మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తుంది. అయితే ఈమె శ్రీనివాస్ కి జోడిగా నటిస్తుందనుకున్నారు అంత.

కానీ తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం… ఇది కథానాయిక ప్రాధాన్యత కలిగిన కథ అంట. కథ మొత్తం హీరోయిన్ కాజల్ చూస్తూనే తిరుగుతుందంట. ఆమెను సపోర్ట్ చేసే పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు అంట. లేడీ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి ఈ సినిమాకు ‘నాయిక’ అనే టైటిల్ అనుకుంటున్నారట మేకర్స్.

ఇందులో కాజల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ‘నేను రాజు నేనే మంత్రి’ సినిమాలో కాజల్ పాత్ర ఎంత బాగుంటుందో అంతకు మించి ఈ సినిమాలో కాజల్ పాత్ర ఉంటుందని ఇన్సైడ్ టాక్. మరి ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అయ్యినప్పుడు శ్రీనివాస్ ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నాడో అర్ధం కానీ విషయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*