సుకుమార్, కొరటాలని చూసి నేర్చుకోవాలి

రంగస్థలం.. భరత్ అనే నేను సినిమా చూస్తే, డైరెక్టర్స్ కన్విక్షన్‌ వల్ల సక్సెస్‌ అయిన సినిమాలివి. అలానే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి… మహేష్ బాబు స్పైడర్‌లు చూస్తే దర్శకుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఫ్లాపయినవి. సక్సెస్ ఉన్న డైరెక్టర్ ని ఏ హీరో క్వశ్చన్‌ చేయడు. సినిమా ఎలాగైనా తీయగలడు అని హీరో నమ్మితే ఆయా డైరెక్టర్ విషయంలో వేలు పెట్టడు.

కానీ బాలీవుడ్ అమీర్ ఖాన్ లాంటి హీరో స్టోరీ విషయంలో జాగ్రత్త పెడతారేమో కానీ మన సౌత్ హీరోస్ వచ్చే సరికి ట్రాక్‌ రికార్డ్‌ అనుగుణంగా వెళ్లిపోతారు. చిరంజీవి లాంటి స్టార్ హీరో ఐతే డిస్కషన్స్ ఉంటాయి ఏమో కానీ మిగతా హీరోస్ అంత దాదాపు దర్శకుడి తీర్పుకే కట్టుబడతారు. దీని బట్టి చూస్తే సినిమా సక్సెస్..ఫెయిల్యూర్ అనేది పూర్తి బాధ్యుడు దర్శకుడేననేది స్పష్టం.

ఒక సినిమా సక్సెస్ రేంజ్ ను హీరో పెంచగలడేమో కానీ ఒక బ్యాడ్‌ సినిమాని ఆడించడం ఏ హీరో తరం కాదు. హీరో ఒకే అనేశాడు అని ఏదో తూతూ మాత్రంగా కథలు రాసేసుకుని సెట్స్‌ మీదకి వెళ్లకుండా సుకుమార్‌..కొరటాల శివ వొళ్ళు దగ్గర పెట్టుకుని స్క్రిప్టు సిద్ధం చేస్తే ఏ సినిమాలూ అజ్ఞాతవాసులు, స్పైడర్‌లు అవ్వవు.