అగ్ర దర్శకులు అంత ఒకే ఫ్రేమ్ లో!

aliya rejects rajamouli offer

నిన్న రాత్రి టాలీవుడ్ అగ్ర దర్శకులంతా ఒక్కటయ్యారు. వీరంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే… కనులకు విందే. సోమవారం రాత్రి దర్శకుడు వంశీ పైడిపల్లి తన ఇంట్లో ఓ పార్టీని నిర్వహించగా, ప్రముఖ దర్శకులంతా హాజరయ్యారు. వీరంతా కలిసి ఓ ఫోటో కూడా దిగారు.

 

కేవలం దర్శకులే..

ఆ ఫోటోను డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. “అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను” అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫోటోలో ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పాటు సుకుమార్, క్రిష్, నాగ అశ్విన్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా, కోరటాల శివ, అనిల్‌ రావిపూడి, హరీశ్‌ శంకర్‌ లతో పాటు వంశీ పైడిపల్లి ఉన్నారు. ఈ ఫోటో ఉన్న దర్శకులు మొత్తం వారి గత సినిమా సక్సెస్ అయిన వారే. ఒక్క హరీష్ శంకర్ తప్ప. ప్రస్తుతం వీరంతా తమతమ చిత్రాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి షేర్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

Sandeep
About Sandeep 6148 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*