ఈ హిట్ వాళ్ళకి కలిసొస్తుందా..?

tamannah and mehreen career after f2

సంక్రాంతి పండగ సెలవులని క్యాష్ చేసుకోవడానికి బరిలో చివరిగా విడుదలైన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా ఈ శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ కౌర్ లు జంటగా నటించారు. వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఫన్నీగా రెచ్చిపోగా.. తమన్నా, మెహ్రీన్ లు వారిని కొరుక్కుతింటూ ఫ్రస్టేషన్ కి గురిచేసే భార్యలుగా నటించారు. ఇక ఈ సినిమా మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిన ఈ సినిమా కామెడీతోనే హిట్ అయ్యింది. అనిల్ రావిపూడి సినిమాలో ఫస్ట్ హాఫ్ ని ఫన్నీగా, సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఫ్రస్టేషన్ తోని తెరకెక్కించడంలో ఫస్ట్ హాఫ్ హిట్, సెకండ్ హాఫ్ వీక్ టాక్ వచ్చింది. ఇంకా ఈ సినిమాకి వెంకటేష్ కామెడి మేజర్ హైలెట్ అవ్వగా… సినిమాటోగ్రఫీ సినిమాని రిచ్ లుక్ లో చూపించడంలో సక్సెస్ అయ్యింది. అనిల్ రావిపూడి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

హీరోయిన్లకు హిట్ పడింది…

ఇక హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ గ్లామర్ లో పోటీపడి మరీ నటించారు. ప్రస్తుతం బ్యాడ్ పొజిషన్ లో ఉన్న తమన్నా, మెహ్రీన్ కి ఈ సినిమా హిట్ ఎంతవరకు పనిచేస్తుందో మాత్రం తెలియదు. ఎందుకంటే ఎఫ్ 2లో తమన్నా, మెహ్రీన్ లు అక్కాచెల్లెళ్లుగా నటించారు. చాలా రోజులకి తమన్నాకి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఈ సినిమాలో దొరికింది. త‌మ‌న్నా గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. మెహ‌రీన్ కి కృష్ణ గాడి వీర ప్రేమ గాధ తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉన్న సినిమా ఇదేనేమో. అలా వ‌చ్చి, ఇలా వెళ్లిపోయే మెహ‌రీన్ కాస్త డైలాగులు చెప్పిన సినిమా కూడా ఇదే అనిపిస్తుంది. ఇక యూరప్ లో తీసిన ఒక పాటలో మాత్రం తమన్నా, మెహ్రీన్ లు గ్లామర్ తో, హాట్ హాట్ లుక్స్ తో అదరగొట్టారు. ఆ పాటలో వారిద్దరూ పోటీ పడి అందాల ప్రదర్శన చేశారు. మరి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లో ఈ హీరోయిన్స్ కి ఏమైనా మేలు జరుగుతుందా.. అంటే కాస్త డౌటే. ఎందుకంటే ప్రస్తుతం ఫేడవుట్ లిస్ట్ లో తమన్నా ఉంటే… మెహ్రీన్ మాత్రం అన్ లక్కీ హీరోయిన్ లిస్ట్ లో ఉంది. మరి ఈ ఎఫ్ 2 హిట్ వీరికి పెద్దగా ఉపయోగపడేలా కనిపించడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*