లాంఛనంగా ప్రారంభమైన ఎఫ్2

venkatesh back to form with f2

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ‘ఎఫ్ 2’ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్ లోని దిల్ రాజు కార్యాలయంలో ఘనంగా జరిగింది. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత‌ వెంకటేశ్…`ఫిదా` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత వరుణ్ తేజ్… `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత అనీల్ రావిపూడిలు కలిసి చేస్తున్న చిత్రం ఇది. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. దేవుడి ప‌టాల‌పై చిత్రీక‌రించిన తొలి స‌న్నివేశానికి హీరోలు వెంక‌టేశ్, వ‌రుణ్‌తేజ్‌ల‌పై అల్లు అర‌వింద్ క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ స్క్రిప్ట్‌ ను డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి అందించారు.

సంక్రాంతికే సిద్ధం…

`ఎఫ్‌2`, ‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్’ ఉప‌శీర్షిక‌తో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా జూలై 5 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్స్‌ గా న‌టిస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్‌తో కామెడీ ఎంట‌ర్ టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఆధ్యంతం ఫ‌న్ రైడ‌ర్‌గా తెర‌కెక్కించనున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేయనున్నట్లు యూనిట్ స‌భ్యులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు కూడా పాల్గొని యూనిట్‌కి శుభాకాంక్ష‌ల‌ను అందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*