‘సంక్రాంతి అల్లుళ్లు’ టీజర్ చూపిస్తారంట..!

varun and venkatesh in f2

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2`. `ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్` ట్యాగ్ లైన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టున్న అనిల్ రావిపూడి `ఎఫ్ 2` సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేస్తున్నారు. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*