సవ్యసాచి స్టోరీ లైన్ పై రెండు సినిమాలు..?

Savyasachi closing collections

రీసెంట్ గా రిలీజ్ అయిన నాగచైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్ తో సినిమా పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉండటంతో.. పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఇప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. చైతు ఎడమ చేయి తన ఆధీనంలో ఉండని ఓ సరికొత్త స్టోరీతో డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాలో చూపించనున్నాడు. ట్రైలర్ చూసిన చాలామంది సెలెబ్రెటీస్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని ఇటువంటి కాన్సెప్ట్ ఎన్నడూ వినలేదని చెప్పారు. సుకుమార్, కీరవాణిలు దీనిపై స్పందిస్తూ చాలా యునీక్ కాన్సెప్ట్ అని ఇంతకుముందెన్నడూ రాలేదని చెప్పుకున్నారు. నిజానికి ఇటువంటి కాన్సెప్ట్ తో మన ఇండియాలో రెండు సినిమాలు వచ్చిన సంగతీ మర్చిపోయారు.

తమిళం, కన్నడంలో వచ్చేశాయా..?

తమిళంలో గత ఏడాది రిలీజ్ అయిన ‘పీచంకాయ్’ అనే సినిమా కూడా ఇటువంటి కాన్సెప్టే. ఇందులో హీరో ఒక పిక్ పాకెటర్. దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఓ సందర్భంలో అతనికి ఆక్సిడెంట్ అయ్యి ఒక చేయి పోతుంది. ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అనే జబ్బు రావడంతో ఎడమ చేయి అతని మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఈ నేపథ్యంలో అతనికి ఓ రాజకీయ నాయుడి సెల్ ఫోన్ కొట్టేయాలని డీల్ వస్తుంది. మరి హీరో ఆ పనిని ఎలా పూర్తి చేస్తాడో అన్నది మిగిలిన కథ. అలానే కన్నడలో ఇటువంటి లైన్ తోనే ‘సంకష్ట కర గణపతి’ అనే సినిమా వచ్చింది. ఇందులో హీరో (లిఖిత్ శెట్టి) ఒక కార్టూనిస్ట్. అతనికి కూడా ఒక ఆక్సిడెంట్ లో ఎడమ చేయి పోతుంది. ఆ చేయితో తనకు తెలియకుండా చాలా సమస్యలు ఎదురుకుంటాడు. ఈ సమస్యల నుండి హీరో ఎలా బయట పడ్డాడు అనేది సినిమా.

ఆ సినిమాల వంటి కథే…

పైన చెప్పిన రెండు సినిమాల కథలు ‘సవ్యసాచి’ కథకు దగ్గరలో ఉంటాయి. పైగా ఈ రెండు సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో అందరు అనుకుంటున్నట్టు ఇదేమి కొత్తగా ఆలోచించిన పాయింట్ కాదు. స్క్రీన్ ప్లే వేరే అవ్వొచ్చు కానీ పాయింట్ మాత్రం ఒక్కటే. మరీ యునీక్ పాయింట్ అయితే కాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*