గీత ఆర్ట్స్ కి… విజయ్ కి పడట్లేదా..?

‘గీత గోవిందం’కి రిలీజ్ టైం దగ్గర పడింది. ఇందులో అల్లు అరవింద్ నుండి డైరెక్టర్ పరుశురాం వరకు అందరూ హీరో విజయ్ ను మంచి మాటలతో పొగిడేవాల్లే. కానీ వాస్తవ పరిస్థితి వేరే అంట. ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో విజయ్ సరిగా సహకరించడం లేదని ఇన్సైడ్ టాక్. ప్రచార కార్యక్రమాల విషయంలో గీత జనాలకు చుక్కలు చూపిస్తున్నాడట.

ప్రత్యేక పీఆర్ టీం పెట్టుకుని…

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి ఫేమ్ రావడంతో తనకు సపరేట్ గా ఒక పీఆర్ టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు విజయ్. ఆ టీం ప్రొమోషన్స్ విషయంలో ఇచ్చే ఐడియాస్ హీరో విజయ్ పాటిస్తాడు. ‘టాక్సీవాలా’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ టీం చిన్న పిల్లలతో ఒక వీడియో చేసి వాదిలారు. అలా ఆ టీం ఐడియాస్ ఇస్తూ ఉంటుంది అంట. అందులో విజయ్ కి నచ్చినవి తీసుకుని ఇంప్లీమెంట్ చేస్తాడట.

నిర్మాతలు చెప్పింది వినడం లేదా..?

‘గీత గోవిందం’ ప్రమోషన్స్ విషయంలో కూడా తన టీం ఇచ్చిన ఐడియాలను పాటించాలన్నదే తన అభిమతం. కాకపోతే గీత సంస్థకు ఆల్రెడీ పీఆర్ టీమ్ ఒకటి వుంది. వాళ్లు గీతలోని పైస్థాయి వ్యక్తుల ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ల సూచనల మేరకు ఈ టీమ్ నడుచుకుంటుంది. దీంతో వారు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వీడియోస్..ప్రెస్ మీట్స్ వగైరా వగైరా వంటివి ప్లాన్ చేసారంట. అవి విజయ్ తో చెప్పితే ఒకే అన్నాడట. తర్వాత తన టీంతో డిస్కస్ చేసి చివరి నిమిషంలో టైం మార్చండి లేదా వద్దు అని అంటున్నాడట. దాంతో గీత ఆర్ట్స్ వారు తలలు పట్టుకుంటున్నారట. ఈ ఒక్క సినిమాకే కాదు ‘టాక్సీవాలా’ విషయంలో విజయ్ అదే చేస్తున్నాడు అని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*