ఇది కదా విజయ్ స్టామినా..!

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకి ఎనలేని క్రేజ్ వచ్చేసింది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ క్రేజ్ అమాంతం స్టార్ హీరో రేంజ్ కి పెరిగిపోయింది అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదు. అందుకే అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ నుండి విజయ దేవరకొండ బయటికి రాలేకపోయాడు. కాంట్రవర్సీ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ రెడ్డిని యూత్ కి గట్టిగా తగిలేలా గురి చూసి వదలడంతో.. యూత్ కి ఎక్కడ తగలాలో అక్కడ గట్టిగా తగిలింది ఆ సినిమా. మరి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి క్రేజ్ ని అప్పటి నుండి బాగా వాడేస్తున్నాడు కూడా. అలాగే రౌడీ వెబ్ సైట్ తో విజయ్ కి యూత్ నుండి ఫుల్ సపోర్ట్ దొరికేసింది. అందుకే విజయ్ సినిమాలకు మర్కెట్ లో క్రేజ్, గిరాకీ కూడా పెరిగాయి. విజయ్ దేవరకొండ సినిమాల మీద అయన అభిమానుల్లోనే కాదు… యావత్ యూత్ లోను అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం విజయ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

స్టార్ హీరోల సినిమాలకు తగ్గకుండా…

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంటగా నటించిన గీత గోవిందం సినిమా ఈ రోజు విడుదలవుతుంది. ఈ సినిమా తో విజయ్ మళ్లీ హిట్ కొట్టేసేలాగానే కనబడుతుంది. ఎందుకంటే గీత గోవిందం ప్రోమో, పాటలు, విజయ దేవరకొండ స్టయిల్, రష్మిక మందన్న లుక్స్ అన్నీ సినిమా మీద అంచనాలు ను పెంచేస్తున్నాయి. మరి బయట బుక్ మై షోలో కూడా స్టార్ హీరో సినిమాల టికెట్స్ బుకింగ్ ఉన్నట్టుగా విజయ దేవరకొండ గీత గోవిందం సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడమే కాదు.. మల్టిప్లెక్స్ లో రెండు రోజుల షోస్ కి టికెట్స్ బుక్ అయ్యాయి అంటేనే విజయ్ స్టామినా ఏమిటనేది అర్ధమవుతుంది. మరి ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ క్రేజ్ టికెట్స్ బుకింగ్ లో కనబడుతూ వస్తుంది. మరి టికెట్స్ బుక్ చేసుకున్న ప్రేక్షకులకు గీత గోవిందం సంతృప్తినిస్తుందో లేదో మరికొద్ది సమయంలో పబ్లిక్ టాక్ తో తెలిసిపోతుంది.