గీత గోవిందం హిట్టయినా సంతోషంగా లేని నిర్మాత..?

విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబోలో లేటెస్ట్ గా తెరకెక్కిన గీత గోవిందం సినిమా గత బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై అదరగొట్టే హిట్ అందుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సినిమాని తమ భుజాల మీద మొయ్యడమే కాదు… ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు ఎంత బాగా సినిమా తీసినా హీరో కరెక్ట్ గా ఫాలో అయితేనే ఆ సినిమా హిట్ అవుతుందని గీత గోవిందం లో విజయ్ దేవరకొండ నిరూపించాడు. సినిమాలో హీరోయిజం, కామెడీ, యాక్షన్ అన్నీ విజయ్ దేవరకొండ చేసేసి థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేసాడు. చాలా తక్కువ బడ్జెట్ తో గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడు చూస్తే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి ఐదారు రేట్ల లాభాలను తీసుకొస్తుంది. ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ తో గీత గోవిందం సూపర్ హిట్ కాదు కాదు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

లాభాలబాటలో బయ్యర్లు

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కి, చేసిన కామెడీ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతూ రిపీటెడ్ ఆడియన్స్ అవుతున్నారు. అందుకే ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సినిమా బిజినెస్ ని నిర్మాత బన్నీ వాస్ కొద్దిగా లాభాలతో అమ్మేశాడు. అయితే సినిమాకి కొద్దిగా లాభాలు మత్రమే మూటగట్టుకున్న బన్నీ వాస్ ఇప్పుడు హ్యాపీగా లేడు. ఎందుకంటే గీత గోవిందం సూపర్ హిట్ అవడం… ఈ సినిమాని కొన్న బయ్యర్లకు లాభాల పంట పండడం చూస్తుంటే బన్నీ వాస్ అన్ హ్యాపీ అనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా ఈ రేంజ్ హిట్ పడుతుందని బన్నీ వాస్ అస్సలు ఊహించకే.. సినిమాని కొద్దిగా టేబుల్ ప్రాఫిట్ తో అమ్మేశాడు. కానీ సినిమా విడుదలై సెన్సేషన్ హిట్ అవడమే కాదు… కొన్నవారికి లాభాల పంట పండిస్తోంది. అందుకే ఎందుకు తక్కువ రేట్లకి సినిమాని అమ్ముకున్నానా.. ఇప్పుడు చూడండి ఏ రేంజ్ లాభాలొస్తున్నాయో అని సన్నిహితుల వద్ద బన్నీ వాస్ వాపోతున్నాడట. ఇప్పుడునుకుని ఏం లాభం. అయినా దిల్ రాజు చెప్పినట్టుగా… 40 రూపాయల అడ్వాన్స్ నుండి 40 కోట్ల నిర్మాతగా బన్నివాస్ కి మంచి పేరైతే గీత గోవిందంతో వచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*