భారీ సినిమాల సరసన గోవిందుడు..!

చిన్న సినిమాగా విడుదలై చితక్కొట్టే కలెక్షన్స్ తో స్టార్ హీరోలకు సైతం చమటలు పట్టిస్తున్న విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాకి మూడు వారాలుగా ఎదురు లేకుండా పోయింది. ఇక ఈ వారం కూడా C/O కంచరపాలెం మినహా గీత గోవిందానికి అడ్డుపడే సినిమా లేకపోవడంతో… మరో వారం దున్నేయ్యడానికి రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన గీత గోవిందం సినిమాని బన్నీ వాస్ తక్కువ బడ్జెట్ తో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమాకి విడుదలైన దగ్గర నుండి ప్రతి వారం గట్టి సినిమా, హిట్టు సినిమా ఎదురుకాకపోవడంతో… ఈ సినిమా అనూహ్యంగా 100 కోట్ల క్లబ్బులోకి మూడో వారంలోనే అడుగుపెట్టేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల సరసన చేరిపోయాడు.

అగ్రహీరోల సినిమాల సరసన…

ఇప్పటికే రికార్డుల మోత మోగిస్తున్న గీత గోవిందం ఇప్పుడు మరో రేర్ ఫీట్ ని సాధించి బిగ్ మూవీస్ సరసన చేరేందుకు పరుగులు పెడుతుంది. ఈ వారం కూడా సరైన సినిమాలు థియేటర్స్ లో లేకపోవడం.. గీత గోవిందం సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉండడంతో .. గీత గోవిందం కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో నైజాం స్టార్ హీరో అనిపించుకుంటున్న విజయ్ దేవరకొండ గీత గోవిందంతో ఇప్పటి వరకు 18.60 కోట్లు షేర్ సాధించాడు. ఇక ఈ వారంలో మరో కోటి లాగేస్తే గనక గీత గోవిందం సినిమా… కలెక్షన్స్ తో దుమ్ము దులిపిన బాహుబలి, బాహుబలి 2, రంగస్థలం, అత్తారింటికిదారేది, మగధీర, శ్రీమంతుడు, డీజే సినిమాల సరసన చేరిపోయే అవకాశం ఉంది.

లాభాలబాటలో బయ్యర్లు…

మరో కోటి షేర్ దాటితే గీత గోవిందం సినిమా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, మహేష్ భరత్ అనే నేను, చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాలకు షాకిచ్చినట్లే. ఇప్పటికే జనతా గ్యారేజ్ ని దాటేసింది. ఇక ఇపుడు భరత్ కి, ఖైదీ కి స్పాట్ పెట్టింది. మరి చాలా చిన్న సినిమాగా భారీ అంచనాల నడుమ విడుదలైన గీత గోవిందం జోరు ఈ రేంజ్ లో ఉండని కనీసం నిర్మాతలు కూడా ఊహించలేదు. అందుకే ఈ సినిమాని చాలాచోట్ల తక్కువ ధరకు అమ్మేశారు. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వస్తే… బయ్యర్స్ మాత్రం చిన్న సినిమాతో అద్భుతమైన లాభాలను వెనకేసుకుంటున్నారు. పెద్ద సినిమాలతో పోగొట్టుకుంది.. ఇలాంటి చిన్న సినిమాలతో కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*