గీత గోవిందం 3 రోజుల వరల్డ్ వైడ్ షేర్స్..!

ఈ వారం రిలీజ్ అయిన ‘గీత గోవిందం’ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చడంతో వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. పరశురామ్ తెరకెక్కించిన ఈ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ మొదటి రోజు నుండే దూకుడు కొనసాగిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి మూడు రోజులకు 13 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇప్పుడు శనివారం, ఆదివారం అన్ని థియేటర్లలో షాకింగ్ ఫిగర్స్ నమోదయ్యేలా ఉన్నాయి. 15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఐదు రోజుల్లో అదంతా వెనక్కు ఇవ్వడంతో పాటు లాభాలు కూడా మొదలుపెట్టడం అంటే బ్లాక్ బస్టర్ రేంజ్ అని చెప్పక తప్పదు. ఈ సినిమాకు ఇక నుండి వచ్చేవన్నీ ప్రాఫిట్స్ మాత్రమే. ఇక ‘గీత గోవిందం’ మూడు రోజుల వరల్డ్ వైడ్ రూ.18.12 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ వివరాలు మీకోసం…

ఏరియా షేర్ ( కోట్లు )

నైజామ్ 5

వైజాగ్ 1.34

సీడెడ్ 2.1

ఈస్ట్ గోదావరి 1.9

వెస్ట్ గోదావరి 0.97

కృష్ణా 1.4

గుంటూరు 1.20

నెల్లూరు 0.44

తెలుగు రాష్ట్రాల 3 రోజుల షేర్ -13.1

కర్ణాటక 1.4

తమిళనాడు 0.98

ఓవర్ సీస్ 3.1

3 డేస్ వరల్డ్ వైడ్ షేర్ – 18 కోట్ల 12 లక్షల రూపాయలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*