పైరసీపై ఆగ్రహించిన మెగాస్టార్

విజయ్ దేవరకొండ – రష్మిక – పరశురామ్ కాంబోలో తెరకెక్కిన గీత గోవిందం సినిమా సూపర్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత అంతటి హిట్ ని ఈ గీత గోవిందంతో అందుకున్నాడు. అయితే తాజాగా నిన్న ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో గీత గోవిందం సక్సెస్ సెలెబ్రేషన్స్ ఒక రేంజ్ లో చేపట్టింది గీత క్యాంప్. బన్నివాస్ నిర్మతగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో.. గీత గోవిందం బృందానికి.. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు స్టార్ హీరో అల్లు అర్జున్ తన ఫార్మ్ హౌస్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చిన రెండో రోజే గీత గోవిందం సక్సెస్ సెలెబ్రేషన్స్ మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా జరిగాయి.

సినిమా విడుదల రోజునే గీత గోవిందం సినిమాని వీక్షించిన చిరంజీవి.. గీత గోవిందం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మట్లాడుతూ… విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో తనకు డిఫరెంట్ స్టైల్ లో ఉండే విజయ్ ని చూపించిందని…. అయితే ఈ గీతగోవిందం చిత్రం నాకు ఖైదీ సినిమా తో ఎటువంటి స్టార్ డం వచ్చిందో…. ఇప్పుడు ఈ గీత గోవిందం తో విజయ్ కు అలానే పేరొచ్చిందని….. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోనే అని చిరంజీవి అభివర్ణించారు. గీత గోవిందం విడుదలకు ముందు మొదట పైరసీ బారిన పడినపుడు తనకు బాధ కలిగిందని…. అయితే అటువంటి పైరసీ పనులు చేయడమంటే…. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమేనని చిరు ఘాటుగా అన్నారు. ఇక తన తమ్ముడు పవన్ నటించిన అత్తారింటికి దారేది విషయంలో కూడా ఇలాగే పైరసీ జరిగిందని…. అప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే గీత గోవిందం సినిమా కూడా హిట్ అవుతుందని తాను తన బావ గారు అల్లు అరవింద్ కి చెప్పానని చెప్పాడు.

అలా సినిమా విడుదలకు ముందే పైరసీ చెయ్యడం అనేది ఇండస్ట్రీకి ఎంతో కీడు చేస్తుందని.. ఏదో ఆకతాయితనంగా సినిమాని తమ మిత్రులకు ముందుగానే చూపించాలని కొందరు పైరసీ చేయడమంటే కోట్లరూపాయలు దోచుకోవడమేనని చిరు అన్నాడు. ఇక గీత గోవిందం సినిమా టీమ్ కి ఆయన అభినందనలు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*