గీత గోవిందం 26 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం ఎవరూ ఊహించని హిట్ అయ్యి కూర్చుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన గీత గోవిందం చిన్న అంటే లో బడ్జెట్ తో తెరకెక్కి అదరగొట్టే కలెక్షన్స్ తో కుర్ర అండ్ స్టార్ హీరోలకు దడపుట్టించేసింది. విజయ్ దేవరకొండ కు గీత గోవిందం తో స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే సినిమా విడుదలై 26 రోజులు కావొస్తున్నా గీత గోవిందం కలెక్షన్స్ ఇంకా పెద్దగా డ్రాప్ కాలేదు. అయితే రేపు విడుదలకాబోతున్న శైలజా రెడ్డి అల్లుడు, యు-టర్న్ చిత్రాల హవా మొదలైతే కాని గీత గోవిందం కలెక్షన్స్ కి బ్రేక్ పడేలా లేదు. ఇక గీత గోవిందం 26 రోజుల వర్డ్ వైడ్ కలెక్షన్స్..

నైజాం 19 .00

సీడెడ్ 6.40

ఉత్తరాంద్ర 5. 57

గుంటూరు 3.63

ఈస్ట్ గోదావరి 3.40

వెస్ట్ గోదావరి 2.97

కృష్ణా 3.51

నెల్లూరు 1.50

రెండు తెలుగు రాష్ట్రాలు 26 రోజుల షేర్ 46 కోట్లు

ఇతర ప్రాంతాలు 8.10

ఓవర్ సీస్ 11.00

ప్రపంచవ్యాప్త 26 రోజుల షేర్ 65.27 కోట్లు