వెంకీ ఫ్యాన్స్ కు స్వీట్ న్యూస్..!

venkatesh back to form with f2

‘గురు’ సినిమాతో గత ఏడాది మనల్ని మెప్పించిన సీనియర్ హీరో వెంకటేష్ తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ అనే సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి నటించడానికి ఓకే చెప్పాడు. అయితే ఈ ఏడాది ‘ఎఫ్ 2’ తో అలరిస్తాడు అనుకున్న అభిమానులు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది వెంకీ మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఎఫ్ 2’ రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దిల్ రాజు నిర్మాణంలో నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

వరుసగా మూడు సినిమాలతో…

అలానే వెంకీ, బాబీ దర్శకత్వంలో నాగ చైతన్య తో కలిసి ‘వెంకీ మామ’ అనే చిత్రంలో నటించనున్నాడు. కొన్నిరోజులు కిందటే ఈ సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. ఇది వచ్చే నెలలో స్టార్ట్ అయి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు వెంకటేష్… త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో సోలో హీరోగా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. త్వరలోనే దీనికి సంబంధించి ఆఫీషిషల్ గా ప్రకటించనున్నారు. ఇది వచ్చే ఏడాది చివర్లో విడుదల కానుంది. ఇలా గ్యాప్ లేకుండా వరసగా మూడు సినిమాలు రిలీజ్ చేయనున్నాడు వెంకీ. వెంకీ ఫ్యాన్స్ కి ఇంతకుమించి స్వీట్ న్యూస్ ఏమి ఉంటుంది..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*