వైఎస్సార్ అభిమానులకు ఆ రోజు పండుగే

another ys rajasekharreddy wanted

జులై 8న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ‘యాత్ర’ బృందం కానుక ఇవ్వాలని నిర్ణయించింది. ఆ రోజున వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ‘కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను…మీతో కలిసి నడవాలని ఉంది…మీ గుండెచప్పుడు వినాలనుంది…’ అనే క్యాప్షన్ తో వైఎస్ అభిమానులతో పాటు రాజకీయ వర్గాలు, సాధారణ ప్రజల్లో యాత్ర చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో పాత్రలకు నటీనటుల ఎంపిక కూడా ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి, రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, కేవీపీ పాత్రలో రావు రమేష్ నటించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*