అలాంటి గాసిప్స్ కి చెక్ పెట్టేదెవరు

ntr happy with kalyanram 118

మెగా ఫ్యామిలి లుకలుకలు? నందమూరి ఫ్యామిలి లో గొడవలు? ఇలా అనేక రకాల క్యాప్షన్స్ తో అనేక రకాల గాసిప్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు కొందరు స్పందిస్తే.. మరికొందరు మాత్రం కామ్ గా ఉండి డీసెన్సీ ని మైంటైన్ చేస్తారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీపై రూమర్స్ కి చెక్ పెట్టారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరు, నాగబాబు, అల్లు అర్జున్ ఇలా మేమంతా ఒక్కటే అని నిరూపించుకున్నారు. కానీ నందమూరి ఫ్యామిలిలో మాత్రం బాలయ్యకి జూనియర్ ఎన్టీఆర్ కి వార్ నడుస్తూనే ఉంది. నందమూరి ఫ్యామిలీ లో బాలకృష్ణ, చంద్రబాబు తప్ప ఎన్టీఆర్ అందరితో సఖ్యంగానే ఉంటాడు. కానీ బాలయ్యే బావ కోసం ఎన్టీఆర్ ని దూరం పెట్టాడనే న్యూస్ ఉంది.

ఇక కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు మాత్రం హరికృష్ణ నీడలో సఖ్యతగానే ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు వారి మధ్యన కూడా గొడవులన్నట్టుగా మీడియా హైలెట్ చేస్తుంది. ప్రస్తుతం అన్న దమ్ములు ఒకరికొకరు అన్నట్టుగానే ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ కి మధ్యన ఎన్టీఆర్ బయో పిక్ చిచ్చు పెట్టిందనే న్యూస్ హైలెట్ అయ్యింది. అందుకే అన్న కళ్యాణ్ రామ్ నా నువ్వే ఆడియో వేడుకకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడంటున్నారు. కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయో పిక్ లో నటిస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ ని బాలయ్య దూరం పెట్టడంతో నేను చెయ్యకుండా ఆ సినిమా లో నువ్వు చెయ్యడమేమిటంటూ కళ్యాణ్ రామ్ ని ఎన్టీఆర్ అడిగినట్లుగా.. అలాగే వారిమధ్యన విభేదాలు మొదలైనట్టుగా కూడా ప్రచారంలో ఉంది.

అలాగే మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మూవీ ఈవెంట్ కి రాలేదని.. అయితే కళ్యాణ్ రామ్ మూవీ ఓపెనింగ్ కి వచ్చిన ఎన్టీఆర్… నా నువ్వే ఆడియో కి రాకపోవడం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ రాకపోవడానికి ఒక కారణం ఉందట. అదేమిటంటే హరికృష్ణ ఫ్యామిలీకి కావాల్సిన విశాఖ దేవీసీఫుడ్స్ ఎం డి ఇంట్లో పెళ్ళికి హరికృష్ణ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు వెళ్లాల్సి ఉండగా.. కళ్యాణ్ రామ్ నా నువ్వే ఆడియో పెట్టుకోవడం, హరికృష్ణ కి ఆరోగ్యం బాగోకపోవడంతో తప్పనిసరి అపరిస్తితుల్లో ఎన్టీఆర్ ఆ పెళ్ళికి వెళ్లాల్సి రావడంతోనే కళ్యాణ్ రామ్ నా నువ్వే ఈవెంట్ కి రాలేకపోయాడట. మరి కేవలం ఆ ఈవెంట్ కి రాకపోవడంతో అన్నదమ్ముల మధ్యన గొడవలంటూ మీడియా మిత్రులు హల్చల్ చెయ్యడం వారిని ఎంత బాధించి ఉంటుందో… మరి ఇలాంటి గాసిప్స్ కి ఎవరైనా స్ట్రాంగ్ గా చెక్ పెడితే బావుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*