బాబు హరి ఏంటి బాబు ఇది!

తమిళ దర్శకుడు హరి గురించి, ఆయన టేకింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అతను హీరోను చూపించే విధానం అందరికి మతిపోవాల్సిందే. హీరోయిజంని ఓవర్ ద బోర్డ్ చూపించడం అతనికి పెట్టింది పేరు. హరి సినిమాల్లో డైలాగ్స్, చేజింగ్, ఫైటింగ్ సీన్స్, చాలా అతిగా అనిపిస్తుంటాయి. అంతేకాదు హీరో ఫేస్ ని ఓ సింహంలానో, పులిలానో చూపించడం అతనికి అలవాటు.

ప‌ద్నాలుగేళ్ల సినిమాకు సీక్వెల్‌…

ఇప్పటివరకు హరి ‘సింగం’ కి సంబంధించి మూడు పార్ట్స్ తీశాడు. మొన్న వచ్చిన ‘సింగం 3’ సరిగా ఆడలేదు. ఈ మూడు సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ ఒకటేలా ఉంటుంది. మళ్లీ మళ్లీ ఇదే స్టయిల్లో సినిమాలు తీయడంతో జనాలకు మొహం మొత్తేసింది. అయినా కానీ హరి తన రూట్ మార్చుకోలేదు. తాను 14 ఏళ్ల కిందట తీసిన పోలీస్ సినిమా ‘సామి’కి సీక్వెల్ తో రెడీ అయ్యాడు.

తెలుగులోనూ అదే టైటిల్‌…

‘సామి స్క్వేర్’ అనే టైటిల్ తెరకెక్కిస్తున్న చిత్రం యొక్క ట్రైలర్ నిన్న రిలీజ్ చేసారు. ట్రైలర్ లో మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ దాకా అతిగానే ఉంది. అవసరం లేని స్పెషల్ ఎఫెక్టులు…. హీరో చెప్పే అతి డైలాగులు ఈ సినిమాను నెగటివ్ షేడ్ కి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు మాస్ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారో, లేదో చెప్పలేం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా.. విలన్ గా బాబీ సింహ చేస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఇదే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*