కళ్యాణ్ రామ్ కోరికకు…. హరికృష్ణ బ్రేక్..!

నందమూరి కళ్యాణ్ రామ్ నటుడిగానే కాదు మంచి నిర్మాత కూడా అని ఆయన సినిమాలు చూస్తే మనకే అర్ధం అవుతుంది. రీసెంట్ గా ఆయన బ్యానర్ లో తన తమ్ముడు ఎన్టీఆర్ తో తీసిన ‘జై లవకుశ’ భారీ విజయాన్ని సాధించింది. వసూళ్లపరంగా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా నిర్మాతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తొలిసారిగా కళ్యాణ్ రామ్ బ్యానర్ లో ఎన్టీఆర్ నటించాడు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కు ఓ ఆలోచన వచ్చిందంట. సొంత బ్యానర్లో తండ్రితో కలిసి తాను .. ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్ రామ్ కు ఓ ఆలోచన వచ్చిందంట. తమ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని తమ ముగ్గురి పాత్రలకు ప్రధానంగా ఉండేటట్టు ఓ కథను రెడీ చేయమని రైటర్స్ కి డైరెక్టర్స్ కి చెప్పాడంట. దీనికి తమ్ముడు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడంట.

తండ్రి దూరమవ్వడంతో…

కానీ ఈలోపే ఘోరం జరిగిపోయింది.. నిన్న ఉదయం రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. పాపం కళ్యాణ్ రామ్ కోరిక నెరవేరకుండా హరికృష్ణ శాశ్వతంగా దూరం అయ్యిపోయారు. దాంతో ఈ ప్రాజెక్ట్ కు ఆగిపోయినట్లు అయింది. కాకపోతే హరికృష్ణ ప్లేస్ లో బాలకృష్ణ ఉంటే ఎలా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారట. మరి దీని గురించి కళ్యాణ్ రామ్ ఏం అంటాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*