కథ లేకుండా.. ఇంతనడిపించాడా…?

గబ్బర్ సింగ్ హిట్ పట్టుకుని స్టార్ హీరోలతో సినిమాలు చేసిన హరీష్ శంకర్ కి మళ్ళీ గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమా పడనే లేదు. బడా నిర్మాత దిల్ రాజు హరీష్ ని నమ్మి రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాధం(డీజే) సినిమాలు నిర్మించాడు. రామయ్య వస్తావయ్యా అట్టర్ ఫ్లాప్ కాగా… సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఓ మోస్తరు హిట్ అయ్యింది. ఇక డీజే దువ్వాడ జగన్నాధం కూడా ఫ్లాప్ అయితే… దిల్ రాజు, హరీష్ లు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక డీజే తర్వాత దిల్ రాజు బ్యానర్ లోనే హరీష్ శంకర్ మరో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే హరీష్ శంకర్ దిల్ రాజు బ్యానర్ లో దాగుడు మూతలు సినిమా చేస్తున్నట్టుగా అటు దిల్ రాజు ఇటు హరీష్ శంకర్ లు అధికారికంగానే ప్రకటించారు. ఇది జరిగి కూడా ఏడెనిమిది నెలలు పైనే అవుతుంది.

ఒక్క సినిమాపై అనేక ప్ర‌చారాలు

అయితే అప్పటినుండి హరీష్ శంకర్ దాగుడుమూతలు కథను డెవెలెప్ చేసే పనిలో ఉన్నాడనే టాక్ వినబడింది. అలాగే హరీష్ శంకర్ కూడా చాలా లొకేషన్స్ ని తన దాగుడుమూతలు కోసం సెట్ చేసి వచ్చాడు. ఇక హరీష్ శంకర్ – దిల్ రాజు కాంబోలో దాగుడుమూతలు సినిమా ఒక మల్టీస్టారర్ గా ఉండబోతుందని.. అందుకు నితిన్, శర్వానంద్ లను హీరోలుగా తీసుకుంటున్నారనే ప్రచారము జోరుగానే జరిగింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి నితిన్ – శర్వా లు ఈ సినిమా నుండి తప్పుకున్నట్టుగా వార్తలు రావడం.. హరీష్ శంకర్ తన సినిమా కోసం స్టార్ హీరోలను సెట్ చేస్తున్నట్లుగా వార్తలు రావడం.. కాదు కాదు మెగా హీరోలతోనే హరీష్ దాగుడుమూతలు ఆడుతాడనే ప్రచారం నడిచింది.

టైటిల్ కూడా రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే

కానీ గత వారం పది రోజులనుండి హరీష్ దాగుడుమూతలుకు దిల్ రాజు చెక్ చెప్పాడని.. హరీష్ తో దిల్ రాజు సినిమా చెయ్యడం లేదని ఒక టాక్ అయితే బయటికొచ్చింది. అయితే దిల్ రాజు హరీష్ తో సినిమా చెయ్యకపోవడం అనేది కరెక్ట్ అట. అసలు హారిష్ కేవలం ఒక లైన్ తీసుకుని దిల్ రాజుని ఇన్నాళ్లు హోల్డ్ లో పెట్టుకున్నాడట. ఆ లైన్ తో ఇంతవరకు దాగుడుమూతలు కథని హరీష్ శంకర్ బిల్డప్ చేయలేదట. అందుకే మండిన దిల్ రాజు హరీష్ కి మరో 10 రోజులు డెడ్ లైన్ పెట్టి కథపై క్లారిటీ ఇవ్వకపోతే.. సినిమా లేదని చెప్పేశాడట. ఇక హరీష్ ని నమ్మి దిల్ రాజు దాగుడుమూతలు టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు.

మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మొద‌లుపెట్టిన దిల్ రాజు

మరి తాజాగా దిల్ రాజు తన సినిమాల లిస్ట్ లో హరీష్ శంకర్ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి హరీష్ శంకర్.. కొన్ని సార్లు అలా జరుగుతాయి అంటూ బాధగా ట్వీట్ కూడా చేసాడు. మరి దిల్ రాజు హరీష్ శంకర్ సినిమా ఆపేసి.. ఇంద్రగంటి తో సినిమా మొదలెట్టబోతున్నాడు. ఇంద్రగంటి చెప్పిన మల్టీస్టారర్ ని దిల్ రాజు త్వరలోనే పట్టాలెక్కించబోతున్నాడట. ఇక ఆ సినిమా కోసం నాని – శర్వానంద్ లను హీరోలుగా సెట్ చేసాడని కూడా సమాచారం. మరి నిజంగానే హరీష్ శంకర్ కథ లేకుండా చాలానే నడిపించాడుగా. కథ చెప్పకుండా ఒక బడా నిర్మాతను ఇన్నిరోజులు ఆపాడు అంటే హరీష్ ని చూస్తుంటే మాత్రం గ్రేట్ అనిపిస్తుందిగా మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*