కసి అయితే ఉంది.. కానీ అవకాశమిచ్చేదెవరు

టాలీవుడ్ లో చెప్పుకోదగిన డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకడు. పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీ అతన్ని ఎక్కడో టాప్ లో నిలబెట్టింది. అంతకుముందు చేసిన సినిమాలు అటు ఇటుగా హిట్ అయినప్పటికీ… గబ్బర్ సింగ్ తో హరీష్ టాప్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో తో చేసిన రామయ్య వస్తావయ్యా, సాయి ధరమ్ తేజ్ తో తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ చిత్రాలు సో సో గా అనిపించాయి. ఇక గత ఏడాది అల్లు అర్జున్ తో తీసిన డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం యావరేజ్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తెచ్చినప్పటికీ… హరీష్ కి అంతగా పేరు రాలేదు. ఇక హరీష్ శంకర్ డీజే సినిమా ప్లాప్ అంటే చాలు ఇంతెత్తున ఎగిసిపడేవాడు.

ఇక ఆ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో దాగుడుమూతలు సినిమా స్క్రిప్ట్ తో తిరుగుతున్న హరీష్ శంకర్ ఆ కథతో పెద్ద హీరోలతో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈ సినిమా లో నితిన్ అండ్ శర్వానంద్ లు నటిస్తారనే టాక్ ఉన్నప్పటికీ హరీష్ మాత్రం మరోసారి గబ్బర్ సింగ్ లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఇక తాను తయారు చేసిన కథ లో ఇద్దరు హీరోలు ఉంటారు కానీ.. ఆ కథ లో ఇద్దరు స్టార్ హీరోలైతేనే బావుంటుందని ఆలోచనతో తన సన్నిహితుల వద్ద చెబుతున్నాడట. ఇక ఆ కథతో ఇద్దరు మెగా హీరోలతోనే సినిమా చెయ్యాలనే కసితో ఉన్నాడట. మరి హరీష్ అనుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ ని అడుగుదామంటే.. ప్రస్తుతం రాజకీయాలతో యమా బిజీగా ఉన్నాడు పవన్.

మరో పక్క అల్లు అర్జున్ కూడా నాపేరు సూర్య ప్లాప్ తో ఈసారి హిట్ కొట్టాలనే ఆలోచనతో… ఒక మంచి కథ కి ఓకె చెప్పాడని… ఆసినిమా త్వరలోనే పట్టాలెక్కనుందనే న్యూస్ ఉంది. ఇక మరో మెగా హీరో రామ్ చరణ్ కి బిజీ షెడ్యూల్. బోయపాటి సినిమా తో పాటుగా కొరటాల, రాజమౌళి సినిమాలు చెయ్యాల్సి ఉంది. ఇక వరుణ్ తేజ్ రెండు మూడు సినిమా ల్తో బిజీ. ఇక సాయి ధరమ్ ప్రస్తుతం ప్లాప్ పొజిషన్ లో ఉన్నాడు. మరి హరీష్ కి ఏ మెగా హీరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. హరీష్ కూడా ఏమంత క్రేజ్ లో లేడు కనుక మెగాహీరోలెవరు ఇప్పట్లో హరీష్ శంకర్ వైపు చూసే ప్రసక్తే లేదు. మరి హరీష్ తన దగ్గర అద్భుతమైన స్క్రిప్ట్ తో స్టార్ హీరోలతోనే సినిమా చేయాలనుకుంటున్నాడు… కానీ వారు హరీష్ కి అవకాశాలిచ్చేదెప్పుడో.. చూద్దాం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*