కూతురిపై మండి పడుతున్న ప్రముఖ నటుడు..!

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ చెన్నైలోని మధురవాయిల్ పోలీస్ స్టేషన్ లో తన కూతురు వనితపై కంప్లైంట్ చేశారు. విజయ్ కుమార్ కు అలపాక్కమ్ లోని అష్టలక్ష్మి నగర్ 11వ వీధిలో ఒక ఇల్లు ఉంది. అది షూటింగ్ చేసుకోడానికి ఇస్తూ ఉంటారు. ఆయన ప్రస్తుతం కొట్టివాక్కమ్ లో ఉన్న మరో ఇంట్లో తన కొడుకుతో కలిసి ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక రోజు వనిత తన వద్దకు వచ్చి అలపాక్కమ్ లో ఉన్న ఇల్లు షూటింగ్ కోసం కావాలని అడిగితే ఆయన ఇచ్చారు.

ఇల్లు ఖాళీ చేయడం లేదని…

షూటింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ చేయమంటే చేయకుండా అక్కడే ఉండి లాయర్లు, రౌడీలతో తన కూతురు బెదిరిస్తోందని తెలిపారు. తన కూతురు వనిత ఆ ఇంటిని ఆక్రమించుకుందని ఫిర్యాదులో పేర్కొనడంతో వనితపై కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు జరుపుతున్నారు. అయితే కేసు నిమిత్తం పోలీసులు అలపాక్కమ్ లో ఉన్న ఇంటికి వెళ్లి అక్కడ వనితను విచారించగా.. ఆమె తనకు కూడా వాటా ఉందని అందుకే ఖాళీ చేయనని చెప్పానని స్పష్టం చేసింది.

ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో…

అయితే ఇల్లు మీది అని చెప్పడానికి ఆధారాలు చూపండి అని పోలీసులు అడిగితే వారితో వనిత వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న మీడియా వాళ్లు అక్కడికి వెళ్లగా వారి కెమెరాలు అన్ని తీసుకుని పగలుకోట్టేసింది. గత కొన్నేళ్ల నుండి వనితకు విజయ్ కుమార్ కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి. వనిత ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో.. విజయ్ కుమార్ కుటుంబం అప్పటి నుండి వనితను దూరంగా పెట్టింది. వనిత తల్లి, విజయ్ కుమార్ భార్య మంజుల కన్నుమూసిన సమయంలో వనిత అక్కడ విజయ్ కుమార్ ఇంటి దగ్గర కనబడింది. ఇక విజయ్ కుమార్ వనితని తన కూతురిగా చూడడం మానేసాడు. ఇక శ్రీదేవి, రుక్మిణి లే విజయ్ – మంజుల కూతుళ్లుగా అందరికీ పరిచయం అవ్వడం, వనిత విజయ్ కుమార్ తో విడిగా ఉండడంతో ఆయనకి ఇద్దరు కూతుళ్లే అని చాలామంది అనుకుంటారు. మరి ఇన్నాళ్లకి వనిత.. విజయ్ కుమార్ ఆస్తుల కోసం ఇలా గొడవ చెయ్యడం అనేది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఈ గొడవ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*