షాకింగ్: హీరో రాజశేఖర్ కు గాయాలు

చాలాకాలం తరువాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన ‘గుర‌డ‌వేగ’ చిత్రంతో ఫామ్ లోకి వచ్చాడు యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్. దాంతో ఆయన అదే ఊపులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు సై అంటున్నారు. ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ‘క‌ల్కి’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘అ!’ చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ప్రశాంత్ 1980 నాటి బ్యాక్‌డ్రాప్‌తో మన ముందుకు వస్తున్నాడు.

రాజశేఖర్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెల్సిందే. రాజశేఖర్ ఇందులో ఇన్నివెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా నటిస్తున్నాడు. తాజా షూటింగ్‌లో భాగంగా యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న టైములో రాజశేఖర్ కు గాయాలు అయ్యాయ‌ని స‌మాచారం. త‌ల‌కు, భుజానికి గాయాలు కావ‌డంతో..వెంటనే యూనిట్ సభ్యులు దగ్గరలో ఉన్న ఆస్ప‌త్రికి తరలించారని తెలుస్తుంది.

అయితే రాజ‌శేఖ‌ర్‌కు స్వ‌ల్ప గాయాలు కావ‌డంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. మూడు వారాలు పాటు రెస్ట్ తీసుకుని షూటింగ్ కి హాజరవచ్చని డాక్టర్స్ చెప్పారట. రాజశేఖర్ ఆ యాక్షన్ సీన్స్ డూప్ లేకుండా చేయడం వల్లే గాయాలు అయ్యాయని తెలుస్తుంది. అయితే ఈ వార్త గురించి ఎక్కడ ప్రచారం లేదు. మరి ఇది నిజమో కాదో తెలియదు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*