రామ్ ఏంటి గెటప్ మార్చాడు..?

రామ్ పోతినేనికి ఈ మధ్యన అస్సలు కలిసి రావడం లేదు. ఉన్నది ఒకటే జిందగీ హిట్ అనుకుంటే… యావరేజ్ అయ్యింది. ఇక హలో గురు ప్రేమ కోసమే హిట్ అనుకుంటే అదీ యావరేజ్ అయ్యింది. కెరీర్ లో పది కాలాలు గుర్తుండిపోయే హిట్ మాత్రం ఇంతవరకు పడడం లేదు. ఏరికోరి దర్శకులను సెలెక్ట్ చేసుకుంటున్నప్పటికీ…రామ్ కి మాత్రం కాలం కలిసి రావడం లేదు. దిల్ రాజు తో అయినా సుడి తిరుగుతుంది అనుకుంటే.. దిల్ రాజు కూడా రామ్ ఫేట్ మార్చలేకపోయాడు. అయితే రామ్ తాజాగా ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్, వెబ్ మీడియాలో హైలెట్ అయ్యింది.

పూరి జగన్నాధ్ తో సినిమా…

గతంలోనే రామ్ ఫ్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకున్న పూరి జగన్నాధ్ కి కమిట్ అయ్యాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో నడిచింది. అయితే ఇప్పుడు హలో గురు తర్వాత రామ్ పూరీతో సినిమా చేయబోతున్నాడనే టాక్ మొదలైంది. అయితే పూరి – రామ్ కాంబో మీద అధికారిక క్లారిటీ లేదు కానీ… వారి కాంబోలో మూవీ పక్కా అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తో చేసిన మెహబూబా ఫ్లాప్ తర్వాత రామ్ కి కథ మీద తన కేవ్ ఆఫీస్ లో గత మూడు నెలల నుంచి కూర్చున్నట్లుగా చెబుతున్నారు. అయితే పూరి కథ మీద కూర్చోవడానికి… ముందు రామ్ కి స్టోరీ లైన్ వినిపించగా… ఆ స్టోరీ లైన్ రామ్ కి నచ్చడంతోనే పూర్తి కథని డెవలప్ చేయమని కోరాడని పూరి అప్పటి నుంచి అదే పనిలో ఉన్నాడని టాక్.

కొత్త గెటప్ అందుకేనా…?

ఇక తాజాగా రామ్ పోస్ట్ చేసిన పిక్ లో న్యూ హెయిర్ స్టైల్, డిఫ్రెంట్ లుక్ తో కనబడుతున్నాడు. మారి ఆ కొత్త లుక్ పూరి సినిమా కోసమే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే వరస ఫ్లాప్స్ లో ఉన్న పూరితో రామ్ సినిమా చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు విశ్లేషకులు. మరి పూరితో సినిమా కోసమే రామ్ గెటప్ మార్చాడా..? లేదా మారేదన్న విషయం ఉందా… అనేది మాత్రం రామ్ స్పందిస్తేనే తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*