మరో హీరోయిన్ కూడా అందుకు రెడీ అయ్యింది!

ఈ మధ్యన పర భాష హీరోయిన్స్ టాలీవుడ్ లో రాజ్యమేలుతున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ అయినా కొంతమంది హీరోయిన్స్ ఇప్పటికి తమ డబ్బింగ్ ని వేరే వాళ్లతోనే చెప్పించుకుంటుంటే… ప్రస్తుతం టాలీవడ్ లోకి దూసుకొచ్చిన కుర్ర పర భాష హీరోయిన్స్ తన పాత్రలకు తామే తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. రెడీ అవడమే కాదు… తొలిప్రేమ సినిమాతో రాశి ఖన్నా, మహానటి సినిమాతో కీర్తి సురేష్, ఫిదా సినిమాతో సాయి పల్లవి తమ సొంత గొంతుతో అదరగొట్టారు. కానీ అజ్ఞాతవాసి సినిమాలోనే అను ఇమ్మాన్యువల్ సొంత గొంతు వాడినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ రాశి ఖన్నా, కీర్తి సురేష్, సాయి పల్లవి లు మాత్రం తమ పాత్రలకు తామే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని సక్సెస్ అయ్యారు.

తెలుగు కూడా నేర్చేసుకుని..

తాజాగా మరో కన్నడ భామ టాలీవుడ్ సినిమాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఆమె ఎవరో కాదు.. ఛలో, గీత గోవిందం సినిమాలతో అద్భుతమైన హిట్స్ అందుకున్న రష్మిక మందన్న. ప్రస్తుతం హిట్ హీరోయిన్ గా మారిపోయి.. లక్కీ గర్ల్ అయిన రష్మిక ఇక నుండి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఛలో, గీత గోవిందం సినిమాల తర్వాత తెలుగులో నాని కి జంటగా.. దేవదాస్, గీత గోవిందం తో రొమాన్స్ పండించిన విజయ్ దేవరకొండలో మరోమారు.. డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటిస్తుంది. అయితే దేవదాస్ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి రష్మిక తెలుగు నేర్చుకుని రెడీగా ఉందట.

గీత గోవిందంకే చెప్పుకోవాలనుకున్నా..

అసలయితే గీత గోవిందం సినిమా అప్పటికే రష్మిక ఆ సినిమాలో తన గీత పాత్రకి తానే డబ్బింగ్ చెప్పాలనుకున్నప్పటికీ… వేరే సినిమాలతో ఉన్న కమిట్మెంట్స్ తో డేట్స్ అడ్జెస్ట్ కాక…. ఆ సినిమాకి వేరేవారితో డబ్బింగ్ చెప్పించారట. కానీ ఇప్పుడు దేవదాస్ సినిమాకి తానే డబ్బింగ్ చెప్పాలని రెడీ అవుతుందట. మరి ఇప్పటికే ట్రెడిషనల్ గ్లామర్ తో స్క్రీన్ ప్రెజెన్స్ అదరగొట్టిన రష్మిక ఇప్పుడు సొంత గొంతుతో ఇంకెన్ని మ్యాజిక్ లు చేస్తుందో. దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలు హిట్ అయ్యాయా… ఇక అమ్మడిని పట్టుకోవడం కష్టమే సుమీ..!