విదేశీ సింగర్ తో మన హీరోయిన్ అఫైర్ నిజమేనా..?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ విదేశీ సింగర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరి స్నేహబంధం గురించి బాలీవుడ్ సర్కిల్స్ లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రియాంక చోప్రా విదేశీ సింగర్ నిక్ జోనస్ తో కలిసి తిరుగుతోందని ప్రచారం చాలా రోజులుగానే జరుగుతోంది. అయితే, వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పరస్పరం చేసుకుంటున్న కామెంట్లు ఈ బంధం నిజమే అనే అనుమానాలు కలిగిస్తోంది.

ఒకరి ఫోటోలకు ఒకరు కామెంట్లు….

నిక్ జోనస్ ఇటీవల ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ జూ ని సందర్శించాడు. జూ లో ఓ జంతువుతో కలిసి వీడియో తీసుకుని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నాడు. దీనిపై ప్రియాంక చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ‘ఎవరు బాగున్నారు..లోల్..’ అని ఆమె ఈ విడియోకు కామెంట్ చేసింది. ఇంతకుముందు కూడా ప్రయాంక పోస్ట్ చేసిన ఓ ఫోటోకు నిక్కి కామెంట్ చేశాడు. దీంతో పాటు ఇటీవల వారు లాస్ ఏంజిల్స్ లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో వీరి బంధం నిజమేనని, కానీ అది కేవలం స్నేహమేనా..? అంతకంటే గాఢమైందా అనేది తేలాలి. ఇక ఇటీవల ఈ విషయంపై స్పందించిన ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా…విదేశీయుడితో ప్రియాంక పెళ్లిని తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు. ఆమె పెళ్లి చేసుకోకున్నా సరే కానీ, విదేశీయుడిని మాత్రం చేసుకోకూడదు అని తెగేసి చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*