చిరు పక్కన తమన్నా కాదా.. మరెవరు..?

thammareddy comments about chiranjeevi

చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం పూర్తి కాగానే.. కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ… చిరు కోసం కథను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ కొరటాల శివ – చిరు కాంబో ఫిక్స్ అనేది నిజం. ప్రస్తుతం చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీగా ఉంటే… కొరటాల మాత్రం చిరు సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. సైరా షూటింగ్ కొలిక్కి రావడమే తరువాయి. కొరటాల మూవీ కోసం చిరు రెడీ అవుతాడు. అయితే చిరు – కొరటాల సినిమా కోసం కథలో ఇంకా పర్ఫెక్షన్ రాని కారణంగా డిసెంబర్ లో మొదలవుతుంది అనుకున్నా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి తర్వాత మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా ఈమధ్యన వార్తలొచ్చాయి.

కాలా హీరోయిన్ ను తీసుకొస్తారా..?

ఇక ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే టాక్ ఉంది. అలాగే చిరు పక్కన తమన్నా భాటియా నటిస్తుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇక తమన్నా అయితే చిరుకి సెట్ కాదని మెగా అభిమానులు కూడా లబోదిబోమన్నారు. తాజాగా చిరు సరసన కొరటాల మూవీలో నటించబోయే హీరోయిన్ బాలీవుడ్ నుండి రాబోతుంది. రజనీకాంత్ సరసన కాలా సినిమాలో నటించిన హ్యూమా ఖురేషి చిరు సరసన నటించబోతుందనే టాక్ మొదలైంది. చిరు మూవీ కోసం హ్యూమా ఖురేషీని ఎంపిక చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

వెంకీ మామతో కూడా…

మరి కాలా సినిమాలో రజనీకి స్పేహితురాలిగా పనిచేసి ఆకట్టుకున్న హ్యూమా… వెంకటేశ్ – నాగ చైతన్య కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ వెంకీ మామాలో వేంకటేశ్ సరసన నటిస్తుందనే న్యూస్ ఉంది. మరి తాజాగా చిరు పక్కన కూడా ప్లేస్ కొట్టేసిన హ్యూమా ఇప్పుడు తెలుగులో సీనియర్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*