ముదురు భామ పెళ్లి కి రెడీనా?

స్టార్ హీరోలందరితో జోడి కట్టి ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ప్రస్తుతం అవకాశాలు లేక పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. మొన్నామధ్య త్రిష పెళ్లి జరగబోతున్నట్టుగా వార్తలొచ్చినప్పటికీ జరగలేదు. తాజాగా త్రిష పెళ్లి కూతురు అవుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. గతంలో ఒకసారి త్రిష పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి వైపు ఆలోచిస్తున్న త్రిష తన పెళ్లి కోసం విదేశాల్లో షాపింగ్ కూడా చేసిందని అందుకే తన స్నేహితులతో కలిసి విదేశాలకు వెళ్లిందని అంటున్నారు.

వరుడిపై నో క్లారిటీ…

అయితే త్రిష పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరనే విషయం మాత్రం తెలియదు గాని త్రిష మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని గట్టిగా వినబడుతుంది. మరి టాలీవుడ్ లో అవకాశాలు లేక కోలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటున్న త్రిష కి తనకి పెళ్లీడు దాటిపోయి చాలా కాలం అయ్యిండని ఇప్పుడు అర్థమైనట్టు ఉంది. అందుకే ఇప్పుడు ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటుంది.

శ్రియ బాటలోనేనా…

ఈ మధ్యనే ముదురు భామ శ్రియ శరణ్ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని కూడా సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యడానికి సై అంటుంది. ఇక త్రిష కూడా పెళ్లయ్యాక కూడా నటిస్తుందో లేదా గృహిణిగా మారి ఇంటి బాధ్యతలు చక్కబెడుతుందో అనేది త్రిష కి పెళ్ళైతే గాని మనకి క్లారిటీ రాదు.