ఇప్పటి హీరోయిన్లు మహాముదుర్లండి..!

కొంతమంది హీరోయిన్స్ ఉంటారు. టాప్ పొజిషన్ లో ఉన్నా లేకున్నా నటనతోనే నెట్టుకొచ్చేస్తారు. కానీ తమ పాత్రలకు తాము డబ్బింగ్ చెప్పుకునే సాహసం చెయ్యరు. త్రిష, నయనతార, సమంత, కాజల్ అగర్వాల్ వంటి టాప్ హీరోయిన్స్ తమ పాత్రలకు ఇప్పటికి అరువు గొంతునే వాడుతుంటారు. కానీ తమ గొంతును సవరించే సాహసం మాత్రం చెయ్యరు. కానీ ఇప్పుడొస్తున్న చాలామంది హీరోయిన్స్ అందమైన నటనతో పాటు అందంగా గొంతును సవరిస్తున్నారు. టాప్ పొజిషన్ కి చేరువలో ఉన్నప్పటికీ… కష్టపడి తెలుగు నేర్చుకుని తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు.

లిస్ట్ లో చేరిన పూజ హెగ్డే

తొలిప్రేమతో రాశి ఖన్నా, కృష్ణార్జున యుద్ధం తో అనుపమ, ఇక తాజాగా గీత గోవిందం హిట్ తో జోష్ లో ఉన్న రష్మిక తెలుగు నేర్చుకుని దేవదాస్ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతుంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా కోసం అనుపమ, కీర్తి సురేష్ లు గొంతులు సవరించగా… మహానటిలో సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ జాయిన్ అయ్యింది. మరి అజ్ఞాతవాసిలో తన హీరోయిన్స్ చేత తెలుగు డబ్బింగ్ చెప్పించిన త్రివిక్రమ్ ఇప్పుడు తన అరవింద సమేత కోసం పూజ తో ప్రయోగం చెయ్యబోతున్నాడు.

స్వయంగా డబ్బింగ్ చెబుతున్న పూజ

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డీజే సినిమాతో టాప్ హీరోయిన్ గా రేస్ లోకి దూసుకొచ్చిన పూజ హెగ్డే.. ప్రస్తుతం మహేష్ తో మహర్షిలో కూడా నటిస్తుంది. అయితే ఎంతగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. పూజ హెగ్డే తెలుగు నేర్చుకుని అరవింద కోసం తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పేసింది. మరి అరవింద డబ్బింగ్ స్టూడియో నుండి తన ఫోటో ఒకటి పూజ సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ అరవింద సమేతలో తానూ తన పాత్రకి డబ్బింగ్ చెప్పినట్లుగా తెలిపింది. కొద్దిగా షూటింగ్ మిగిలుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ బిజీ అయ్యాడు. మరి దసరా టార్గెట్ తో అంటే ఆ మాత్రం స్పీడుండాలిలే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*