విజయ్ కి భయపడుతున్న హీరోలు..?

Vijay Devarakonda in Forbes list

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి దగ్గరైన విజయ్ దేవరకొండకు జనాల పల్స్ ఏంటో అప్పుడే అర్ధం అయిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆడియో లాంచ్ అప్పుడు విజయ్ స్పీచ్ యూత్ ని మరింత అట్రాక్ట్ చేసింది. దానికి తోడు సినిమా సూపర్ హిట్ కావడంతో విజయ్ కు ఫ్యాన్స్ ఫామ్ అయ్యారు. ‘అర్జున్ రెడ్డి’ నుండి విజయ్ తన ప్రతి సినిమా ప్రమోషన్స్ విషయంలో దగ్గర నుండి మరి చూసుకుంటున్నాడు. ఇక ఆడియో ఫంక్షన్ లో అయితే మనోడు చెలరేగిపోతాడు. కుర్రాళ్లకు కిక్కిచ్చే మాటలతో అదరగొట్టేస్తాడు. ‘గీత గోవిందం’ సినిమాతో మరో సక్సెస్ ని అందుకున్న విజయ్ ని చూస్తే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు భయపడిపోతున్నారు. దాంతో మనోడి సినిమా వస్తుందంటే ఆ డేట్స్ చూసుకుని మరి తమ సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు మన హీరోలు.

విజయ్ తో పోటీ లేకుండా…

ఆ తరువాత వచ్చిన ‘నోటా’ సినిమా డిజాస్టర్ అయినా మనోడి క్రేజ్ ఏమి తగ్గలేదు. రెండు రోజులు కిందట రిలీజ్ అయిన ‘ట్యాక్సీవాలా’కి హిట్ టాక్ రావడంతో విజయ్ క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం. ‘నోటా’ రిలీజ్ రోజునే అంటే అక్టోబర్ 5 న రవి తేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మనోడి క్రేజ్ చూసి రవితేజ నవంబర్ 16న వచ్చాడు. అయినా పోటీ తప్పలేదు. ఆ తరువాత రోజు అంటే శనివారం విజయ్ ట్యాక్సీవాలాతో వచ్చి హిట్ కొట్టాడు. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అందుకే మన హీరోలు విజయ్ సినిమాలకి పోటీ లేకుండా తమ సినిమాలను ప్లాన్ చేస్తుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*