భరత్ కోసం భారీగా…?

బాలీవుడ్ లో రెండు వరస డిజాస్టర్స్ తో ఉన్న సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం భరత్ కోసం భారీగా రెడీ అవుతున్నాడు. టార్చిలైట్, రేస్ 3 దెబ్బకి సల్మాన్ బాగా దిగాలు పడ్డాడు. భారీ బడ్జెట్ లతో తెరకెక్కిన రెండు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో… తన మూడో సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ భరత్ సినిమాని అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ముందుగా హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ని తీసుకోగా.. ఆమె పలు కారణలతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అయితే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే ప్రియాంక తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి మరో భామ కత్రినా కైఫ్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.

సర్కస్ ఆర్టిస్ట్ లుగా హీరోహీరోయిన్లు

ఇక ఈ సినిమా లో మరో బాలీవుడ్ సుందరి దిశా పటాని కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సర్కస్‌ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. సర్కస్‌ ఆర్టిస్టుగా అంటే బాడీ లోని ఫిట్నెస్ ఎలా ఉండాలో తెలుసుగా.. అందుకే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం జిమ్ లో కుస్తీలు పడుతున్నాడట. ఇక సల్మాన్ మాత్రమే కాకుండా దిశా పాటాని కూడా ఈ భారత్ సినిమాలో సర్కస్‌ ఆర్టిస్టుగా నటిస్తుందట. ఇక సర్కస్‌ ఆర్టిస్ లుగా అంటే.. ఈ సినిమాలో సల్మాన్, దిశలు చేసే సర్కస్ ఫీట్స్ ఓ రేంజ్ లో ఉంటాయంటున్నారు.

భారీ ఎత్తున పాట చిత్రీకరణ

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే… భరత్ లోని సల్మాన్‌ ఇంట్రడక్షన్ సాంగ్‌ ని దర్శకుడు అలీ అబ్బాస్‌ షూట్ చేస్తున్నాడట. ఆ సర్కస్ కి సంబంధించిన పాటలో సల్మాన్ తో పాటుగా దిశా పటాని కూడా పాల్గొంటుందట. ఈ పాట భరత్ సినిమాకే హైలెట్ అని… అందుకే భారీగా ఈ సాంగ్ షూటింగ్ కోసం ఖర్చు పెడుతున్నారని.. అలాగే ఈ సాంగ్‌ కోసం ఐదు వందలమంది దాకా డ్యాన్సర్స్‌ పాల్గొనబోతున్నారనే న్యూస్ బాలీవడ్ మీడియాలో ప్రముఖంగా వినబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*