హ్యూమా నువ్వు సూపరంతే..!

హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను బాగా పాటిస్తారు. అందుకే వచ్చిన కాడికి దండుకుంటారు. బాలీవుడ్ లో కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న హ్యూమా ఖురేషీకి రజినీకాంత్ తన కాలా సినిమాతో లైఫ్ ఇచ్చాడు. సౌత్ లో సూపర్ స్టార్ సినిమా లో నటించిన హ్యూమా ఖురేషి కి కాలా సినిమా యావరేజ్ అయినప్పటికీ… ఆమెకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వత హ్యూమా ఖురేషి కి సౌత్ నుండి అవకాశాలు క్యూ కట్టలేదు గానీ… ఆమెకి మాత్రం క్రేజ్ బాగానే పెరిగింది. అందుకే అమ్మడు తన క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడింది.

వెంకీ సరసన మల్టీస్టారర్ లో…

తాజాగా హ్యూమా పేరు టాలీవుడ్ లో కూడా వినబడుతోంది. సీనియర్ హీరో వెంకటేష్ పక్కన హ్యూమా ఖురేషి నటించబోతున్నట్లుగా గత నెల రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్ 2 లో వెంకీ సరసన తమన్నా నటిస్తుంది. ఇక నాగ చైతన్య – వెంకటేష్ కాంబోలో బాబీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే మల్టీస్టారర్ సినిమాలో వెంకటేష్ సరసన హ్యూమా ఖురేషి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావించడంతో.. హ్యూమాని సంప్రదించారట. అయితే ఆమె మాత్రం వెంకటేష్ సరసన నటించేందుకు భారీ పారితోషకం డిమాండ్ చేసిందని తెలుస్తుంది.

అప్పుడే ఇలా పెంచేస్తే ఎలా…

ఇంకా పారితోషకం గురించి చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక పారితోషికం విషయంలో హ్యూమా ఖురేషి ఒక మెట్టుదిగితే ఆమె ఎంపిక ఖరారైపోయినట్టేనని అంటున్నారు. మరి ఇప్పుడిప్పుడే సౌత్ అవకాశాలు దక్కించుకుంటున్న హ్యూమా ఖురేషి ఇలా పారితోషకాన్ని భారీగా పెంచేడం మాత్రం ఆమె కెరీర్ కి మంచిది కాదంటున్నారు. కొందరేమో హ్యూమా నువ్వు సూపరమ్మా అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*