హుషారు హుషారుగా వెళ్ళిపోతుంది

husharu cinema telugu post telugu news

గత నెలలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విలయాన్ని నమోదు చెయ్యడమే కాదు.. నిర్మాతలకు రెండింతలు లాభాలు తెచ్చిపెట్టిన హుషారు సినిమా గుర్తుందా… ఎందుకు గుర్తుంటుంది.. ఆ సినిమా చిన్న సినిమా కావడం ఒక కారణమైతే… ఆ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ లేకపోవడం మరో కారణం. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్ అనే కొత్త కుర్రాళ్లు హీరోలుగా నటించిన ఈ సినిమాని శ్రీహర్ష కొనుగంటి డైరెక్ట్ చేసాడు. చిన్న సినిమాగా విడుదలై అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చిన ఈ సినిమాని చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపడ్డాయి.

మీడియా పబ్లిసిటీ లేకపోయినా… మౌత్ టాక్ అండ్ సోషల్ మీడియా ప్రచారంతోనే హుషారు సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ బుల్లి సినిమాని పొరుగు రాష్ట్రమంటే తమిళ తంబీలు తమ భాషలోకి రీమేక్ చేయబోతున్నారట. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆర్జున్ రెడ్డి ని తమిళులు ఎలా రీమేక్ చేస్తున్నారో… ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిన్న సినిమాని అలానే రీమేక్ చేయబోతున్నారు. ఇక ఈ హుషారు తమిళ రీమేక్ కి వివి కతిర్ డైరెక్టర్ గాను జె. ఫణీంధ్ర కుమార్ నిర్మాతగానూ వ్యవహరించనున్నారట. మరి ఇక్కడ చిన్న సినిమాగా పెద్ద హిట్ కొట్టిన హుషారు అక్కడ తమిళంలో కూడా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*