ఇలియానా భలే ప్లాన్ వేసింది..!

Ileana Hot Photos in Julayi Movie

తెలుగులో ఒక్క సినిమాకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన ఇలియానా డిక్రూజ్ ‘దేవదాస్’ చిత్రం తరువాత వరసగా తెలుగులో చాలా సినిమాలు చేసింది. తన నడుం సోయగాలతో తెలుగు ప్రేక్షకులకు మతులు పోగొట్టేసిన ఈ బ్యూటీ రవితేజతో ‘కిక్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక 2012లో ‘జులాయ్’ వంటి సినిమాల్లో మెరిసిన ఇలియానా అప్పటి నుండి తెలుగులో కనిపించడం మానేసింది.

టాలీవుడ్ పై కామెంట్స్ తో…

బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో తెలుగు సినిమాలకు దూరమైంది. ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీపై కామెంట్స్ కూడా చేసింది. “అక్కడ నా నడుం చూపించడానికే ఎగబడతారు” అంటూ కామెంట్స్ చేసింది. అప్పట్లో ఆమెకు అవకాశం ఇద్దాం అనుకున్న దర్శకులు ఆ దెబ్బతో అటువైపు కూడా వెళ్ల‌లేదు. ఈలోగా హిందీ లో లావుగా ఉందనే కారణాలతో ఆఫర్స్ తగ్గిపోయి ఖాళీగా కూర్చుందని తెలిసి డైరెక్టర్ శ్రీను వైట్ల.. రవితేజ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. దాంతో అమ్మడు ఆ విధంగా ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో హీరోయిన్ అయిపోయింది.

బ‌రువు త‌గ్గే ప‌నిలో…

రిలీజ్ కి దగ్గరలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కోసం గత వారం రోజుల నుండి బీభత్సంగా లిక్విడ్ డైట్ చేస్తూ.. వెయిట్ తగ్గే పనిలో ఉందట. ఈ సినిమా తరువాత మరో సినిమా అవకాశం రావాలి కాబట్టి.. కాస్త సీరియస్ గా వెయిట్ తగ్గుదామని డిసైడ్ అయిందంట. మునుపటి ఫిగర్ ను తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అని టాక్. మరి ఈమెను మన దర్శకనిర్మాతలు గుర్తించి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*